Varun Dhawan Virat Kohli Anushka Sharma : తన లేటెస్ట్ మూవీ 'బేబీ జాన్' ప్రమోషన్స్‌లో బిజీగా ఉంటోన్న హీరో వరుణ్ ధావన్, తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు. తన చిత్రాల్లోని కోస్టార్స్ గురించి పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. ముఖ్యంగా 'సుయి ధాగా' హీరోయిన్ అనుష్క శర్మ గురించి కూడా మాట్లాడారు.
"2018లో రిలీజైన 'సుయి ధాగా' కోసం హీరోయిన్ అనుష్క శర్మతో కలిసి నటించాను. ఆ తర్వాత మేమిద్దరం మంచి ఫ్రెండ్ అయ్యాం. షూటింగ్ టైమ్‌లో ఎన్నో విషయాల గురించి మేమిద్దరం మాట్లాడుకునే వాళ్లం. ఆమె ఎంతో మంచి వ్యక్తి. నిజాయితీగా కూడా ఉంటుంది. అనుకున్న విషయాన్ని నిస్సంకోచంగా చెబుతుంది. దీనివల్ల ఎదుటి వ్యక్తులు కొన్ని సార్లు ఇబ్బంది కూడా పడతారు. అన్యాయాన్ని అస్సలు సహించలేదు. సాధారణంగా ఆమెను చూసి బయటివారు ఒక ఉద్దేశానికి వచ్చేస్తారు. కానీ నిజం చెప్పాలంటే ఆమె గురించి ఎవరికీ ఏమీ తెలియదు. ఈ ప్రపంచం తన గురించి తెలుసుకుంటుందా? లేదా? అనే విషయాన్ని ఆమె అస్సలు పట్టించుకోదు"
"విరాట్ కోహ్లీ గురించి కూడా ఆమె అప్పుడప్పుడు మాట్లాడుతుంటుంది. ఆయన చాలా సెన్సిటివ్ అని, సంప్రదాయబద్ధమైన వ్యక్తి అని కూడా చెప్పింది. నాటింగ్‌హామ్ టెస్టు మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఓడిపోవడంతో ఆయన రూమ్‌లో కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నారని నాతో తెలిపింది. ఆ రోజు మ్యాచ్‌లో ఆయన మంచి స్కోర్ చేసినప్పటికీ కూడా ఓటమి విషయంలో తనని తాను ఎంతగానో నిందించుకున్నారని అనుష్క తెలిపింది" అని వరుణ్ ధావన్ చెప్పుకొచ్చారు.
కాగా, 'బేబీ జాన్' సినిమా విషయానికి వస్తే, వరుణ్ ధావన్ - కీర్తి సురేశ్ జంటగా నటించిన సినిమా ఇది. దర్శకుడు అట్లీ దీనికి కథ అందించారు. వామికా గబ్బీ, జాకీ ష్రాఫ్ కీలక పాత్రలు పోషించారు. క్రిస్మస్ కానుకగా ఈ నెల 25న సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. కోలీవుడ్‌లో తెరకెక్కిన తెరీ రీమేక్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు, పాటలు ప్రేక్షకులను బానే ఆకట్టుకున్నాయి.
పృథ్వీ షాపై కంప్లైంట్! - 'అతడు ఉన్నా లేనట్లే, ట్రైనింగ్‌కు రాడు, లేట్ నైట్ పార్టీస్‌కు వెళ్తాడు'
అశ్విన్ బాటలో టీమ్ ఇండియా సీనియర్లు - వారు రిటైర్మెంట్ ప్రకటిస్తారా?