ETV Bharat / state

విలువైన సమాచారాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టిన కేసీఆర్‌ను శిక్షించాలి : సీఎం రేవంత్‌ - CM REVANTH REDDY FIRES ON KCR

క్రిమినల్‌ కేసుల్లో ఇరుకున్న సంస్థలకు ధరణి పోర్టల్‌ అప్పగించారన్న సీఎం - కొత్త తరహా ఆర్థిక నేరాలకు గత ప్రభుత్వ సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టారని వ్యాఖ్య

CM Revanth Reddy Fires On KCR
CM Revanth Reddy Fires On KCR (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 20, 2024, 10:46 PM IST

CM Revanth Reddy Fires On KCR : కుట్రపూరితంగా ఆర్థికనేరాలకు పాల్పడిన సంస్థలకు ధరణిని కట్టబెట్టి రాష్ట్ర భూముల సమాచారాన్ని దేశ సరిహద్దులు దాటించారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. భారత్‌తో ఎలాంటి ఒప్పందాలు లేని, ఆర్థికనేరగాళ్లకు స్వర్గధామంగా ఉండే దేశాలకు సమాచారాన్ని పంపి ఆర్థిక నేరాలకు పాల్పడిన కేసీఆర్​ పట్ల కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు. అసెంబ్లీలో భూభారతి బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి ధరణిలోని లోపాలు నూతన చట్టం ఆవశ్యకతను వివరించారు. పురపాలకశాఖ మంత్రిగా పనిచేసి కేటీఆర్​ అనుచరుడు గాదె శ్రీధర్‌రాజు ఆధ్వర్యంలో IL&FS, టెరాసిస్‌ టెక్నాలజీస్‌ సహా వివిధ కంపెనీల ద్వారా భూసమాచారమంతా దేశసరిహద్దులు దాటిందని తెలిపారు. భూభారతిపై చర్చ జరిగితే బీఆర్ఎస్​ సర్కార్‌ భూదోపిడీ బయటపడుతుందనే సభలో అనవసరమైన రచ్చకు తెరలేపారని మండిపడ్డారు.

"యువరాజు మిత్రుడు గాదె శ్రీధర్‌రాజు కంపెనీకి ధరణి పోర్టల్​ నిర్వాహణ అప్పగించారు. క్రిమినల్‌ కేసుల్లో ఇరుకున్న సంస్థలకు పోర్టల్​ను అప్పగించారు. టెరాసిస్‌ చేతిలో పెట్టిన ధరణి పోర్టల్‌ పది సంస్థల చేతులు మారింది. ఫాల్కన్‌ హెచ్‌బీ అనే ఫిలిప్పీన్‌ కంపెనీ, తర్వాత సింగపూర్‌ కంపెనీ చేతికి వెళ్లింది. ధరణి ఏ కంపెనీ చేతిలోకి వెళ్లినా సీఈవోగా గాదె శ్రీధర్‌రాజు ఉన్నారు. ట్యాక్స్‌ హెవెన్ దేశాల కంపెనీల చేతిలో మన ధరణి పోర్టల్‌ పెట్టారు. మన ధరణి పోర్టల్‌ ఫిలిప్పీన్స్‌, సింగపూర్‌ కంపెనీల చేతిలోకి వెళ్లింది. ధరణి పోర్టల్‌ కెమెన్‌ ఐలాండ్స్, వర్జిన్‌ ఐలాండ్‌ మీదుగా తిరిగింది. ధరణి పోర్టల్‌ నిర్వహించిన వాళ్లెవరూ భారతీయులు కాదు. ఆర్థికనేరాలకు పేరొందిన దేశాలు, సంస్థల చేతుల్లో మన రైతుల వివరాలు పెట్టారు. రైతుల సమాచారమంతా ఆర్థికనేరాల్లో చిక్కుకున్న కంపెనీల చేతిలో పెట్టారు. ఎంతో విలువైన సమాచారాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టిన కేసీఆర్‌ను శిక్షించాలి. మేం మాత్రం ధరణి నిర్వహణను కేంద్ర సంస్థ అయిన ఎన్‌ఐసీకి అప్పగించాం"- రేవంత్ రెడ్డి, సీఎం

భూభారతి బిల్లుకు శాసనసభ ఆమోదం - రాష్ట్రంలో ప్రతి సమస్య భూమితోనే ముడిపడి ఉందన్న సీఎం

రూ.55 కోట్లు కాదు 600 కోట్లు దోచిపెట్టేందుకు ప్లాన్ చేశారు : సీఎం రేవంత్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.