T20 Worldcup 2024 Kohli RohithSharma : టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్‌కు దూసుకెళ్లింది టీమ్ఇండియా. చివరి సారిగా 2014లో తుదిపోరుకు అర్హత సాధించిన భారత్ జట్టు మళ్లీ పదేళ్ల తర్వాత ఇప్పుడు టైటిల్ పోరుకు ఇప్పుడు వెళ్లింది. తాజాగా జరిగిన రెండో సెమీఫైనల్ ఇంగ్లాండ్‌పై అద్భుత విజయం సాధించడం వల్ల ఇది జరిగింది. ఈ విజయంలో స్పిన్నర్లు కీలకంగా వ్యవహరించారు. అలాానో హిట్ మ్యాన్ కూడా మెరుగైన స్కోర్ చేశాడు. కానీ ఇక్కడ బాధకరమైన విషయం ఏంటంటే కోహ్లీ ఈ మ్యాచ్‌లోనూ చేతులెత్తేశాడు. 9 బంతుల్లో 9 పరుగులు మాత్రమే చేశాడు. అసలీ ఈ టోర్నీ ప్రారంభం నుంచి పరుగులే చేయలేదు.
అయితే మ్యాచ్ విజయం అనంతరం కోహ్లీ పెర్ఫామెన్స్‌తో పాటు మ్యాచ్ గెలుపుపై మాట్లాడాడు రోహిత్ శర్మ. ఈ విజయం ఆత్మ సంతృప్తినిచ్చింది. జట్టుగా మేము ఎంతో కష్టపడ్డాము. పరిస్థితులను త్వరగా అలవాటు చేసుకుని ముందుకు వెళ్లాం. మ్యాచుల్లో గెలిచాం. ఇప్పుడు సాధించిన ఈ గెలుపు చాలా ఏళ్ల పాటు గుర్తుండిపోతుంది. బౌలర్లు, బ్యాటర్లు ఒక్కసారి కుదురుకుంటే విజయం సాధించడం చాలా సులువు అని నిరూపించాం.
ఓ దశలో మేము 140-150 పరుగులకే ఆగిపోతాం అని భావించాము. అయితే సూర్య, నేను కాస్త దూకుడుగా ఆడాం. కనీసం 170 ప్లస్ స్కోరు చేస్తే చాలనిపించింది. లోయర్ ఆర్డర్‌లో కూడా విలువైన పరుగులు చేశాం. బౌలింగ్‌లో అక్షర్ పటేల్, కుల్‌దీప్ అదిరే ప్రదర్శన చేశారు. వారు గన్ స్పిన్నర్లు. ఇలాంటి పిచ్‌లో వారిని ఎదుర్కోవడం ఎంతో కష్టం. ఒత్తిడిలో కూడా వారు వికెట్లు పడగొట్టగలరు. మొదటి ఇన్నింగ్స్ పూర్తవ్వగానే మా లక్ష్యం స్టంప్స్‌పై బంతులేయడం అని మట్లాడుకున్నాం. మేమేమి ప్రత్యర్థి బ్యాటర్లను తక్కువగా అంచనా వేయలేదు. లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడి బంతులు సంధిస్తే వికెట్లు పడతాాయి. ఈ పోరులో మా బౌలర్లు అదే చేశారు. అని హిట్ మ్యాన్ పేర్కొన్నాడు.