ETV Bharat / sports

వన్డే కెప్టెన్సీలోనూ మార్పు- రోహిత్ ప్లేస్​లో హార్దిక్- IPL సీన్ రిపీట్? - TEAM INDIA ODI CAPTAIN

టీమ్ఇండియాలో భారీ మార్పులు జరిగే ఛాన్స్- వన్డే కెప్టెన్​గా హార్దిక్?

Team India Odi Captain
Team India Odi Captain (Source : Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : Jan 3, 2025, 3:12 PM IST

Team India ODI Captain : కొత్త సంవత్సరంలో టీమ్ఇండియాలో భారీ మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ లేకుండానే ఆస్ట్రేలియాతో భారత్​ ఐదో టెస్టు ఆడుతోంది. రోహిత్‌తోపాటు విరాట్ కోహ్లీ కూడా సుదీర్ఘ ఫార్మాట్‌కు గుడ్ బై చెబుతారనే వార్తలు వస్తున్నాయి. తాజాగా మరో అంశం ప్రచారంలోకి వచ్చింది. టీమ్ఇండియా వన్డే కెప్టెన్సీలో మార్పు జరగనున్నట్లు తెలుస్తోంది.

ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యకు వన్డే బాధ్యతలు అప్పగించేందుకు బీసీసీఐ రెడీ అవుతోందని ​ క్రీడా వర్గాలు చెబుతున్నాయి. 2025 జనవరిలోనే ఇంగ్లాండ్, భారత్ పర్యటనకు రానుంది. ఈ టూర్​లో భారత్​తో ఇంగ్లాండ్ 5 టీ20, 3వన్డేలు ఆడనుంది. ఈ సిరీస్​లోనే పాండ్యను వన్డే కెప్టెన్​గా నియమించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

ఒకవేళ అదే జరిగితే ఫిబ్రవరిలో ప్రారంభం కానున్న 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో టీమ్‌ఇండియా రోహిత్‌కు బదులు పాండ్య నాయకత్వంలోనే బరిలోకి దిగుతుంది. అప్పుడు రోహిత్ జట్టులో ప్లేయర్​గా ఉంటాడా? టెస్టులతోపాటు వన్డేలకూ గుడ్‌బై చెబుతాడా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాగా, 2024 ఐపీఎల్​కు ముందు రోహిత్​ను కాదని ముంబయి ఇండియన్స్​ జట్టుకు హార్దిక్​ను మేనేజ్మెంట్ కెప్టెన్​గా నియమించింది.

మూడు ఫార్మాట్లకు ముగ్గురు
స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ఇప్పటికే టీమ్ఇండియా టీ20 రెగ్యులర్​ కెప్టెన్​గా కొనసాగుతున్నాడు. ఇక టెస్టుల్లో రోహిత్ స్థానంలో కెప్టెన్​గా ఎంపికైన బుమ్రా సైతం రాణిస్తున్నాడు. భవిష్యత్​లోనూ బుమ్రాకే టెస్టు పగ్గాలు అప్పగించే ఛాన్స్ ఉంది. వన్డే ఫార్మాట్ బాధ్యతలు పాండ్య అందుకుంటే అప్పుడు మూడు ఫార్మాట్లకు భారత్​ను ముగ్గురు వేర్వేరు నాయకులు నడిపించనున్నారు. ఇలా భారత క్రికెట్‌లో గతంలో ఎప్పుడూ లేదు. లిమిటెడ్ ఓవర్ల క్రికెట్ (వన్డేలు, టీ20)కు ఒకరు, టెస్టులకు మరొకరు కెప్టెన్సీ చేసిన దాఖలాలు మాత్రమే ఉన్నాయి.

రోహిత్ బాటలోనే
మరో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కూడా ఆసీస్ పర్యటనలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. బహుషా విరాట్​కు కూడా ఇదే ఆఖరి టెస్టు సిరీస్ అంటూ ప్రచారం సాగుతోంది. ఇక ఛాంపియన్స్​ ట్రోఫీలో ఆడేసి ఆంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలుకుతాడని విరాట్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కానీ, ఫామ్​లో లేకపోతే ఎంతటి ప్లేయర్ అయినా బెంచ్​కే పరిమితం అవ్వడం ఖాయమని తాజాగా రోహిత్​ను చూస్తే తెలిసిపోతుంది. మరి ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు భవిష్యత్ గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి!

'రెస్ట్ పేరు చెప్పి రోహిత్​ను కావాలనే తప్పించారు - ఏ కెప్టెన్ కూడా ఇలా చేయడు'

కోచ్‌ Vs కెప్టెన్‌ - అందుకే రోహిత్ ప్లేస్​లో బుమ్రా - 'ఆ ఆలోచన అప్పుడే వచ్చిందా?!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.