ETV Bharat / international

రియల్ ఎస్టేట్ టైకూన్​ టు ప్రెసిడెంట్- డొనాల్డ్​ ట్రంప్‌ జీవితంలో కీలక మలుపులెన్నో! - DONALD TRUMP BIOGRAPHY

47వ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్- నూతన అధ్యక్షుడి గురించి ఆసక్తికర విషయాలు ఇవే!

Donald Trump Biography
Donald Trump (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 20, 2025, 8:49 PM IST

  • దూకుడు ఆయన నైజం
  • ఏటికి ఎదురీదడం ఆయన తత్వం
  • తెంపరితనం ఆయనకు ఆయుధం

వాటినే అస్త్రాలుగా మల్చుకొని అగ్రరాజ్య అధినేతగా రెండు సార్లు విజయం సాధించారు. ఆయనే డొనాల్డ్‌ ట్రంప్. తన దూకుడుతో రియల్‌ ఎస్టేట్‌ టైకూన్‌గా ఎదిగిన ట్రంప్ రాజకీయ రంగంలో మరింత దుందుడుకు వైఖరితో అమెరికన్ల హృదయాలు కొల్లగొట్టారు. ఎన్నో ఆరోపణలు, మరెన్నో కేసులు ఎదుర్కొంటున్నప్పటికీ, ఏమాత్రం వెనకడుగు వేయకుండారెట్టించిన మొండిధైర్యంతో రెండోసారి అమెరికా పీఠాన్ని అధీష్టించారు.

అల్లరి చేష్టల వల్ల మిలటరీ స్కూల్​కు
అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికల్లో మూడుసార్లు పోటీచేసి రెండుసార్లు జయభేరి మోగించిన డొనాల్డ్‌ ట్రంప్ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం నుంచి రాజకీయ రంగంలోనూ తనదైన ముద్ర వేశారు. 1946 జూన్‌ 14న రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజం ఫ్రెడ్‌ ట్రంప్, మేరీ అన్నే దంపతులకు నాలుగో సంతానంగా డొనాల్డ్‌ జన్మించారు. చిన్నప్పటి నుంచే తన కొంటె చేష్టలతో చిచ్చరపిడుగు అనే పేరు తెచ్చుకున్నారు. పాఠశాలలో డొనాల్డ్‌ అల్లరి తట్టుకోలేక ఉపాధ్యాయులు చేతులెత్తేయగా, 13వ ఏట ట్రంప్‌ను ఆయన తల్లిదండ్రులు మిలిటరీ అకాడమీలో చేర్చారు. తర్వాత పెన్సిల్వేనియా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందిన ట్రంప్‌ తన అన్నయ్య పైలట్‌ వృత్తిని ఎంచుకోవడం వల్ల తండ్రి వ్యాపారమైన రియల్‌ ఎస్టేట్‌ రంగంలో అడుగు పెట్టారు. తన సోదరుడు మద్యానికి బానిసై 43వ ఏట ప్రాణాలు కోల్పోవడం ట్రంప్‌ను కలచివేసింది. ఫలితంగా ట్రంప్‌ ఆల్కహాల్‌, సిగరెట్లను పూర్తిగా మానేశారు.

వ్యాపారం కోసం తండ్రి నుంచే రుణం
తండ్రి వారసత్వాన్ని అందుకున్నప్పటికీ సొంతంగా తానేంటో నిరూపించుకోవాలన్నది ట్రంప్ అభిమతం.ఈ క్రమంలో మిలియన్‌ డాలర్లను తన తండ్రి నుంచి రుణంగా తీసుకొని రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలో అడుగు పెట్టారు. న్యూయార్క్ సిటీలో కొన్ని టౌన్‌షిప్‌లు నిర్మిస్తూ క్రమంగా ఎదిగారు. 1971 నాటికి కంపెనీపై పూర్తి పట్టు సాధించారు. 1999లో ట్రంప్‌ తండ్రి మరణించిన తర్వాత కంపెనీని పరుగులు పెట్టించారు. పెద్దపెద్ద రియల్‌ ఎస్టేట్ ప్రాజెక్టులు చేపట్టి విజయం సాధించారు. అట్లాంటిక్‌ సిటీ, చికాగో, లాస్‌ వేగాస్‌తోపాటు తుర్కియే, ఫిలిప్పీన్స్‌ వంటి దేశాల్లో పెద్దపెద్ద హోటళ్లు, టవర్లు, కేసినోలు, గోల్ఫ్‌ కోర్సులు అభివృద్ధి చేశారు.

యాక్టరే కాదు రచయిత కూడా
అనంతర కాలంలో వినోద రంగంలోనూ అడుగుపెట్టిన ట్రంప్- మిస్‌ యూనివర్స్, మిస్‌ యూఎస్​ఏ, మిస్‌ టీన్‌ యూఎస్​ఏ వంటి అందాల పోటీలు నిర్వహించారు. ఎన్​బీసీ రియాల్టీ షో కూడా నిర్వహించారు. తన హావభావాలతో తుంటరిగా కనిపించే డొనాల్డ్‌ ట్రంప్‌లో రచయిత కూడా దాగున్నారు. చాలా పుస్తకాలు రచించిన డొనాల్డ్‌ కొన్ని సినిమాల్లో కూడా నటించారు. రెజ్లింగ్‌లోనూ సందడి చేసిన ట్రంప్ మద్యం నుంచి నెక్‌ టైల వరకూ అనేక వ్యాపారాల్లోనూ ప్రవేశించారు. తర్వాత కాలంలో అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్న ట్రంప్ పలు సందర్భాల్లో దివాలా తీసే పరిస్థితి వరకూ వెళ్లారు. ఈ క్రమంలో ట్రంప్‌ స్టీక్స్‌, ట్రంప్‌ యూనివర్సిటీ కుప్పకూలాయి.

డొనాల్డ్ ట్రంప్‌ కుటుంబ నేపథ్యం కూడా ఆసక్తికరంగా ఉంటుంది. ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. మొదటి భార్య ఇవాన జెల్‌నికోవా చెక్‌రిపబ్లిక్‌ అథ్లెట్. ఆమె మోడలింగ్‌ కూడా చేశారు. ట్రంప్, ఇవాన దంపతులకు ముగ్గురు సంతానం డొనాల్డ్‌ జూనియర్, ఇవాంక, ఎరిక్. ట్రంప్, ఇవాన దంపతులు 1990లో విడిపోయారు. 1993లో హాలీవుడ్‌ నటి మార్లా మాపిల్స్‌ను ట్రంప్‌ వివాహమాడారు. వారికి ఓ బాలిక జన్మించాక 1999లో విడిపోయారు. 2005లో ప్రస్తుత భార్య మెలానియాను పెళ్లి చేసుకున్నారు. వారికి బారన్‌ విలియమ్ ట్రంప్‌ అనే కుమారుడు జన్మించాడు. ప్రస్తుతం అతని వయసు 18 ఏళ్లు. తన జీవిత ప్రస్థానంలో ట్రంప్‌ అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. లైంగిక వేధింపులు, వివాహేతర సంబంధాల ఆరోపణలు ఆయన్ను వెంటాతూనే ఉన్నాయి. కొన్ని కేసుల్లో జరిమానాలు కూడా చెల్లించారు. మరికొన్ని ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

రాజకీయ ప్రస్థానం :

  • రిఫామ్​ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ 2000లో రంగంలోకి దిగారు.
  • 2012నాటికి రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా తెరపైకి వచ్చారు.
  • 2016 అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్‌తో తలపడి అమెరికా 45వ అధ్యక్షుడిగా గెలిచారు.
  • 2017 జనవరి 20న అమెరికా 45వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం చేశారు.
  • 2017 నుంచి 2021 వరకూ తన నాలుగేళ్ల పాలనలో ట్రంప్‌ అనేక వివాదాస్పద, సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.
  • 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌ చేతిలో ఓడిపోయారు.
  • 2021 జనవరి 6న తన అనుచరులతో భారీ ర్యాలీ, క్యాపిటల్‌ హిల్‌పై దాడి వల్ల ట్రంప్ అభిశంసన ఎదుర్కోవాల్సి వచ్చింది.
  • అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కొన్న మూడో అమెరికా అధ్యక్షుడిగా ఉన్నారు.
  • 2024నాటికల్లా మరోసారి రిపబ్లికన్ల తరఫున అధ్యక్ష ఎన్నికల బరిలోకి ట్రంప్ దూకారు.
  • నాలుగు క్రిమినల్‌ కేసులు సహా మొత్తం 91 అభియోగాలు ఎదుర్కొంటూనే అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు.
  • 2024 అధ్యక్షల్లో డెమొక్రట్ల పార్టీ నుంచి పోటీ చేసిన కమలా హారిస్​పై​ ట్రంప్‌ అమెరికా 47వ అధ్యక్షుడిగా గెలిచారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.