ETV Bharat / sports

కోచ్‌ Vs కెప్టెన్‌ - అందుకే రోహిత్ ప్లేస్​లో బుమ్రా - 'ఆ ఆలోచన అప్పుడే వచ్చిందా?!' - GAMBHIR VS ROHIT

గంభీర్​ Vs రోహిత్​ - తుది జట్టులో రోహిత్​ ఔట్​ - ఫైర్ అవుతున్న ఫ్యాన్స్- ఏమైందంటే?

Gambhir vs Rohit
Gambhir vs Rohit (AFP)
author img

By ETV Bharat Sports Team

Published : Jan 3, 2025, 7:17 AM IST

Gambhir vs Rohit : కోచ్, కెప్టెన్‌ మధ్య విభేదాలు భారత క్రికెట్​లో ఎన్నో కల్లోలాలు సృష్టించాయి. ప్పట్లో ఛాపెల్‌-గంగూలీ, కొన్నేళ్ల కిందట కుంబ్లే-కోహ్లి మధ్య కాంట్రవర్సీలు నడవగా, ఇప్పుడు గంభీర్, రోహిత్‌ శర్మ కూడా అదే బాట పట్టినట్లు తెలుస్తోంది. వాళ్లిద్దరి మధ్య మనస్పర్ధలు వస్తున్నాయని తెలుస్తోంది. దీనికి తోడు టీమ్‌ఇండియా వరుస పరాభవాలు అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. జట్టులో విభేదాలు, ప్లేయర్స్ పేల ఫామ్, కోచ్‌పై కొందరు ప్లేయర్లకు విశ్వాసం లోపించడం ఇలా డ్రెస్సింగ్‌రూమ్‌ వాతావరణం ఏమాత్రం ఆరోగ్యకరంగా లేదని క్రికెట్ వర్గాల మాట. తాజాగా తుది జట్టులో రోహిత్‌ శర్మ లేకపోవడం ఈ రూమర్స్​ నిజమే అన్నట్లుగా చేస్తోంది. గంభీర్, రోహిత్‌ మధ్య విభేదాలు కొట్టొచ్చినట్లు కనిపించాయని క్రిటిక్స్​ కూడా అభిప్రాయపడుతున్నారు.

అప్పుడే అర్థమైపోయింది!
ఇదిలా ఉండగా, గురువారం మధ్యాహ్నం బుమ్రాతో కలిసి సిడ్నీ పిచ్‌ను పరిశీలించాడు గంభీర్‌. వారిద్దరు పనిలో నిమగ్నమైన కొన్ని నిమిషాలకు రోహిత్‌ వాళ్లతో కలిశాడు. కానీ కోచ్‌కు కెప్టెన్‌ అంతగా మాట్లాడుకోలేదు. అంతేకాకుండా మ్యాచ్‌కు ముందు జరిగిన మీడియా సమావేశానికి (సాధారణంగా కెప్టెన్‌ వస్తాడు) గంభీర్‌ మాత్రమే హాజరయ్యాడు. అప్పుడు కూడా ఆఖరి టెస్టుకు తుది జట్టులో రోహిత్‌ స్థానం గురించి వచ్చిన ప్రశ్నలకు అతడు క్లారిటీగా సమాధానం ఇవ్వలేకపోయాడు. పిచ్‌ను పరిశీలించి చెబుతామని అన్నాడు.

"నిజాయతీ, ప్రదర్శనే ఆటగాళ్లు టీమ్‌ఇండియా డ్రెస్సింగ్‌రూమ్‌లో ఉండడానికి ప్రమాణాలు" అని గంభీర్ అన్నాడు. ఆ తర్వాత అతడు బుమ్రాతో మాట్లాడుతూ కనిపించాడు. దీంతో ఎంసీజీలో ఉన్న వాళ్లందరికీ కెప్టెన్, కోచ్‌ల మధ్య మాటలు లేవని స్పష్టంగా అర్థమైంది. ఆ సమయంలోనే గంభీర్‌ భవిష్య ప్రణాళికల్లో రోహిత్‌ లేడన్నది కూడా తెలిసిందని విశ్లేషకుల మాట.

అయితే సిడ్నీ టెస్టులో రోహిత్‌ను ఆడించి, టెస్టులకు వీడ్కోలు పలికే అవకాశం కల్పిస్తే బాగుంటుందని, బీసీసీఐకి సంబంధించిన ఓ అధికారి గంభీర్‌తో చెప్పినట్లు సమాచారం. కానీ గంభీర్‌ మాత్రం సిడ్నీ టెస్టు గెలిచి డబ్ల్యూటీసీ ఫైనల్‌ రేసులో టీమ్ఇండియా ఉండటానికే తాను ప్రాధాన్యమిస్తానంటూ స్పష్టం చేశాడట. దీంతో ప్రాక్టీస్ తర్వాత రోహిత్​ను పక్కనబెట్టి అతడి స్థానంలో బుమ్రాను తీసుకున్నారు. అయితే అంతకుముందు నుంచే రోహిత్‌కు విశ్రాంతినివ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. భారత క్రికెట్లో దాని అర్థం ముందుగా చెప్పి జట్టు నుంచి తప్పిస్తున్నట్లే అని క్రిటిక్స్ అంటున్నారు. ఆ ఆలోచన అప్పుడే వచ్చిందా అంటూ చర్చించుకుంటున్నారు.

మరోవైపు రోహిత్ తుది జట్టులో లేకపోవడం తమకు బాధగా ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. సోషల్ మీడియా వేదికగా​ ఫైర్ అవుతున్నారు. రోహిత్​ను ఇలా చేయడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. తనకు మద్దతు తెలుపుతూ నెట్టింట పోస్ట్​లు పెడుతున్నారు.

'పారిపోవద్దు రోహిత్, ఫైట్ చెయ్'- హిట్​మ్యాన్​కు మాజీ క్రికెటర్ సూచన

డ్రెస్సింగ్ రూమ్‌ రూమర్స్​పై గంభీర్‌ స్ట్రాంగ్ కామెంట్స్ - 'ఆ మాటలు మన మధ్యే ఉండాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.