T20 Worldcup 2024 Rohith sharma : టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ సూపర్ రికార్డ్ సాధించాడు. టీ20 వరల్డ్ కప్ హిస్టరీలో నాకౌట్ మ్యాచ్‌లో అర్ధ శతకం బాదిన తొలి భారత కెప్టెన్‌గా ఘనతను అందుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో 68 పరుగుల తేడాతో టీమ్ఇండియా విజయం సాధించింది.
ఈ పోరులో రోహిత్ (39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 57) హాఫ్ సెంచరీతో బాదాడు. దీంతో టీ20 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లో అర్ధ శతకం నమోదు చేసిన తొలి భారత కెప్టెన్‌గా నిలిచాడు. 2007 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో అప్పటి కెప్టెన్ ధోనీ 21 బంతుల్లో 36 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు నాకౌట్ మ్యాచ్‌ల్లో భారత కెప్టెన్ చేసిన హయ్యెస్ట్ స్కోర్ ఇదే. ఇప్పుడు దాన్ని రోహిత్ శర్మ బ్రేక్ చేశాడు.
రోహిత్@5000(Rohith Sharma 5000 runs) - టీమ్ఇండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో 5 వేల పరుగుల మార్క్‌ను టచ్ చేశాడు. ఈ లిస్ట్‌లో విరాట్ కోహ్లీ 12883 పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు. ధోనీ 11207, మహమ్మద్ అజారుద్దీన్ 8095, గంగూలీ 7643 రోహిత్ కన్నా ముందున్నారు.