తెలంగాణ

telangana

ETV Bharat / sports

దంచికొట్టిన విరాట్, అక్షర్- సౌతాఫ్రికా టార్గెట్​ 177 - T20 World Cup 2024

India Vs South Africa T20 Final : టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‌లో భాగంగా భారత్, సౌతాఫ్రికా జట్లు పోటాపోటీగా తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తొలి ఇన్నింగ్స్ ఎలా సాగిందంటే?

T20 World Cup final
IND VS SA T20 WORLD CUP (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Jun 29, 2024, 9:42 PM IST

Updated : Jun 29, 2024, 10:06 PM IST

India Vs South Africa T20 Final :దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమ్‌ ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. సౌతాఫ్రికాకు 177 పరుగుల లక్ష్యం నిర్దేశించింది.

టీమ్ ఇండియా ఓపెనర్‌ విరాట్‌ కోహ్లీ (76; 59 బంతుల్లో 6×4, 2×6) కీలక మ్యాచ్‌లో అదరగొట్టాడు. అక్షర్‌ పటేల్‌ (47; 31 బంతుల్లో 1×4, 4×6) దూకుడుగా ఆడాడు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (9) తక్కువ పరుగులకే ఔటయ్యాడు. మహరాజ్‌ బౌలింగ్‌లో క్లాసెన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఒక్క బంతి వ్యవధిలోనే తొలి డౌన్‌లో వచ్చిన రిషభ్‌ పంత్‌ (0) పరుగులేమీ చేయకుండానే డికాక్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అప్పటికి జట్టు స్కోరు కేవలం 23 పరుగులు మాత్రమే.

అక్కడికి స్వల్ప వ్యవధిలోనే సూర్యకుమార్‌ యాదవ్‌ (3) రబాడా బౌలింగ్‌లో షాట్‌కు ప్రయత్నించి క్లాసెన్‌ చేతికే చిక్కిపోయాడు. దీంతో ఐదు ఓవర్లలోనే కీలకమైన 3 వికెట్లు కోల్పోవడం వల్ల భారత క్రికెట్ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే, అప్పుడే క్రీజులోకి వచ్చిన అక్షర్‌ పటేల్‌(47)తో కలిసి విరాట్ కోహ్లీ(76) చక్కటి ఇన్నింగ్స్‌ నిర్మించాడు. ఇద్దరూ క్రీజులో నిలదొక్కుకొని వీలుచిక్కినప్పుడల్లా ఎడాపెడా ఫోర్లు, సిక్సర్లు బాదేశారు. దీంతో టీమ్‌ ఇండియాకు కాస్త సాంత్వన చేకూరింది.

ఇదిలా ఉండగా, అర్ధశతకానికి చేరువలో ఉన్న సమయంలో సమన్వయ లోపం వల్ల అక్షర్‌ పటేల్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు. చివరిలో శివమ్‌ దూబె (27; 16 బంతుల్లో 3×4,1×6) మెరుపులు మెరిపించాడు. దీంతో టీమ్‌ ఇండియా మంచి స్కోరు చేసింది. జడేజా (2), హార్దిక్‌ పాండ్య (5*) పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్‌ మహరాజ్‌, నోకియా తలో 2 వికెట్లు పడగొట్టగా, మార్కో యాన్సెన్, రబాడ చెరో వికెట్ తీశారు.

ఫైనల్ మ్యాచ్​కు సుధీర్- స్టేడియం వద్ద ఫుల్ రష్- టీమ్ఇండియా ఫ్యాన్స్​ తగ్గేదేలే! - T20 World Cup 2024

సూరీడు వచ్చేశాడోచ్- ఫైనల్ పిచ్ సేఫ్- ఇక యుద్ధమే! - T20 world cup 2024

Last Updated : Jun 29, 2024, 10:06 PM IST

ABOUT THE AUTHOR

...view details