ETV Bharat / entertainment

'పుష్ప 2' షూటింగ్ కంప్లీట్ - స్పెషల్ ఫొటోతో అల్లు అర్జున్ ఎమోషనల్ నోట్ - PUSHPA 2 SHOOTING

'పుష్ప 2' షూటింగ్ కంప్లీట్ - నెట్టింట అల్లు అర్జున్ ఎమోషనల్ నోట్

Pushpa 2 Shooting
Allu Arjun Pushpa 2 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 26, 2024, 7:51 PM IST

Pushpa 2 Shooting Completed : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, డైరెక్టర్ సుకుమార్‌ కాంబోలో రూపొందుతున్న 'పుష్ప: ది రూల్‌' సినిమా షూటింగ్ తాజాగా కంప్లీట్ అయ్యింది. ఈ క్రమంలో బన్నీ ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. " లాస్ట్ డే షూటింగ్. అద్భుతమైన ఐదేళ్ల 'పుష్ప' ప్రయాణం పూర్తయింది" అంటూ ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేశారు. దాంతో పాటు షూట్​కు సంబంధించిన ఓ ఫొటోను కూడా షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం అది కాస్త నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.

రన్​టైమ్ ఎంతంటే?
మరోవైపు 'పుష్ప 2' రన్‌టైమ్‌ పార్ట్ 1 కంటే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం దాదాపు 3 గంటల 21 నిమిషాల నిడివితో ఉంటుందట. ప్రస్తుతం ఈ వార్త కూడా బాగా వైరల్ అవుతోంది. ఇక తొలుత అనుకున్న స్క్రిప్ట్​నే ఇంకాస్త్ మెరుగుపరిచి, దానికి ఇంకాస్త మరిన్ని మెరుగులు దిద్ది 'పుష్ప: ది రూల్‌'ను రెడీ చేశారు. ఈ క్రమంలో ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్, ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే పెంచేశాయి.

తాజాగా వచ్చిన ట్రైలర్​లో జాతర ఫైట్​, మాస్ సీన్స్​కు అభిమానులు బాగా కనెక్ట్ అయ్యారు. అంతేకాకుండా కొన్ని ట్విస్ట్​లు, మరికొన్ని కొత్త క్యారెక్టర్ల పరిచయంతో ఆ వీడియో చాలా ఇంట్రెస్టింగ్​గా సాగింది. ఈ క్రమంలో అన్ని భాషల్లోనూ మిలియన్స్​కు పైగా వ్యూవ్స్​తో ఇప్పటికీ ట్రెండింగ్​లో ఉంది ఈ ట్రైలర్.

ఇక 'పుష్ప 2' సినిమా విషయానికి వస్తే డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. నేషనల్ క్రష్​ రష్మిక మందన్నా ఫీమేల్​ లీడ్​గా మెరుస్తుండగా, మాలీవుడ్​ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్, సీనియర్ నటులు జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి అదిరిపోయే సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన రెండు పాటలు చాట్​బస్టర్లుగా నిలిచాయి. మరో పాట త్వరలోనే విడుదల కానుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్​పై రవి శంకర్, నవీన్ ఈ సినిమాకు సంయుక్తంగా ప్రోడ్యూస్ చేస్తున్నారు.

ఆ విషయంలో షారుక్​ను వెనక్కి నెట్టిన బన్నీ! - అంతా 'పుష్ప' ఎఫెక్టే!

ఇది కదా 'పుష్ప రాజ్' బ్రాండ్ అంటే- తెలుగులో తొలి సినిమాగా రికార్డ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.