తెలంగాణ

telangana

ETV Bharat / sports

చరిత్ర సృష్టించిన ఉగాండ బౌలర్- టీ20 వరల్డ్​కప్​లోనే తక్కువ ఎకనమీ- టాప్​5 లో వీళ్లే! - T20 World Cup 2024

T20 World Cup Best Bowling Figures: 2024 టీ20 వరల్డ్​కప్​లో పూర్తిగా బౌలర్ల ఆధిపత్యం నడుస్తోంది. ఈ క్రమంలో రీసెంట్​గా ఉగాండ బౌలర్ పొట్టి కప్ చరిత్రలోనే అతి తక్కువ ఎకనమీ నమోదు చేశాడు.​

T20 World Cup
T20 World Cup (Source: Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Jun 6, 2024, 4:56 PM IST

T20 World Cup Best Bowling Figures:2024 వరల్డ్​కప్​ రసవత్తరంగా సాగుతోంది. తాజాగా ఉగాండ జట్టు పొట్టికప్​ టోర్నమెంట్​లో తొలి విజయం నమోదు చేసింది. గురువారం పపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్​లో ఉగాండ 3 వికెట్ల తేడాతో నెగ్గింది. ఈ క్రమంలోఉగాండ బౌలర్​ సుబుగా ఓ అద్భుతమైన రికార్డు సృష్టించాడు.

43 ఏళ్ల వయసులో సుబుగా టీ20 వరల్డ్​కప్ చరిత్రలోనే అతి తక్కువ ఎకనమీతో బౌలింగ్ చేసి రికార్డు కొట్టాడు. న్యూ గినియాతో జరిగిన మ్యాచ్​లో సుబుగా తన 4 ఓవర్ల స్పెల్​లో 4 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అందులో 2 మెయిడెన్ ఓవర్లు ఉన్నాయి. అంటే ఈ మ్యాచ్​లో సుబుగా ఎకనమీ 1.00 మాత్రమే. ఈ క్రమంలో సుబుగా సౌతాఫ్రికా బౌలర్ అన్రీచ్ నోకియా (1.80 ఎకనమీ; 4-0-7-4) రికార్డు బద్దలుకొట్టాడు. ఇక టీ20 వరల్డ్​కప్​ చరిత్రలో టాప్- 5 బౌలింగ్ స్పెల్స్ (4 ఓవర్ల పూర్తి కోటా) ఎంటో చూద్దాం.

వానిందు హసరంగ (3- 8): 2022 వరల్డ్​కప్​లో యూఏఈపై శ్రీలంక స్పిన్నర్ వానిందు హసరంగ కెరీర్ బెస్ట్ స్పెల్ నమోదు చేశాడు. ఈ మ్యాచ్​లో హసరంగ 4 ఓవర్ల కోటా పూర్తి చేసి 8 పరుగులిచ్చి 3 వికెట్లు నేలకూల్చాడు. (4-0-8-3). (ఎకనమీ 2.00)

మహ్మదుల్లా (1- 8): 2014 పొట్టికప్​ టోర్నీలోలో బంగ్లాదేశ్ తన తొలి మ్యాచ్​లో అఫ్గానిస్థాన్​లో తలపడింది. ఈ మ్యాచ్​లో బంగ్లా బౌలర్ మహ్మదుల్లా అదరగొట్టాడు. బంగ్లా తరఫున టీ20ల్లో తక్కువ ఎనకమీతో బౌలింగ్ చేసిన ప్లేయర్​గా నిలిచాడు. ఈ మ్యాచ్​లో మహ్మదుల్లా 4 ఓవర్లలో కేవలం 8 పరుగులిచ్చి 1 వికెట్ దక్కించుకున్నాడు. (ఎకనమీ 2.00)

అజంతా మెండీస్ (6-8):2012 ప్రపంచకప్​లో శ్రీలంక స్పిన్నర్ అజంతా మెండీస్ ఔరా అనిపించాడు. జింబాబ్వేతో మ్యాచ్​లో 2 మెయిడెన్లు సహా కేవలం 8 పరుగులిచ్చి ఏకంగా 6 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి ఓటమిని శాసించాడు. ఈ మ్యాచ్​లో మెండీస్ 4-2-8-6 గణాంకాలు నమోదు చేశాడు. (ఎకనమీ 2.00)

అన్రీచ్ నోకియా (4-7):2024 వరల్డ్​కప్​లోనే రీసెంట్​గా శ్రీలంకతో మ్యాచ్​లో సౌతాఫ్రితా బౌలర్ నోకియా నిప్పులు చెరిగాడు. ఈ మ్యాచ్​లో నోకియా 4 ఓవర్ల కోటాలో (4-0-7-4) నమోదు చేశాడు. ఎకనమీ 1.80. దీంతో అప్పటివరకు ఉన్న రికార్డులు చెరిపేసి నోకియా సంచలనం సృష్టించాడు.

ఫ్రాంక్ సుబుగా (2-4):నోకియా క్రియేట్ చేసిన రికార్డును ఉంగాడ బౌలర్ సుబుగా మూడు రోజుల్లోనే బద్దలుకొట్టాడు. గురువారం న్యూగినియా మ్యాచ్​లో (4-2-4-2) గణాంకాలతో వరల్డ్​కప్​ చరిత్రలోనే అతి తక్కువ ఎకనమీ (1.00) నమోదు చేసిన ప్లేయర్​గా రికార్డు కొట్టాడు.

పొట్టికప్​లో 'భారత్' బోణీ- ఐర్లాండ్​పై ఆల్​రౌండ్ షో - T20 World Cup 2024

కుప్పకూలిన ఐర్లాండ్- టీమ్ఇండియా టార్గెట్ ఎంతంటే?

ABOUT THE AUTHOR

...view details