Team India Winning Moments:టీమ్ఇండియా టీ20 వరల్డ్‌కప్ టైటిల్ నెగ్గడంతో యావత్ దేశం సంబరాల్లో మునిగిపోయింది. శనివారం బర్బడోస్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 7 పరుగుల తేడాతో నెగ్గింది. దీంతో ప్లేయర్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆఖరి బంతికి జట్టు విజయం అందుకోగానే మైదానంలో టీమ్ఇండియా ప్లేయర్లంతా భావోద్వేగానికి లోనయ్యారు. కెప్టెన్ రోహిత్ శర్మ అలా మైదానంలో వాలిపోయాడు. అటు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్య ఎమోషనలయ్యారు.
ఇక ప్లేయర్లంతా తమదైన రీతిలో సంబరాలు చేసుకున్నారు. జాతీయ జెండా పట్టుకొని మైదానం అంతా తిరుగుతూ సందడి చేశారు. ఎన్నాళ్లనుంచో ఎదురుచూస్తున్న వరల్డ్‌కప్ ట్రోఫీని అందుకొని ప్లేయర్లంతా ఎంతో మురిసిపోయారు. ఈ మధుర క్షణాలు స్టేడియంలో ప్రేక్షకులతోపాటు, ఇటు టీవీల్లో వీక్షిస్తున్న అభిమానులను సైతం ఆకట్టుకున్నాయి. ఈ విన్నింగ్ మూమెంట్స్‌ను ప్లేయర్లు, జట్టు సిబ్బంది బాగా ఎంజాయ్ చేశారు. మరి ఈ గోల్డెన్ మూమెంట్స్ మీరూ చూసేయండి.
మ్యాచ్ విషయానికొస్తే, 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ జట్టు ఓవర్లన్నీ ఆడి 169/8 స్కోర్‌కే పరిమితమైంది. హెన్రీచ్ క్లాసెన్ (52 పరుగులు; 27 బంతుల్లో 2×4, 5×6) రాణించాడు. క్వింటన్ డికాక్ (39 పరుగులు; 37 బంతుల్లో 4×4, 1×6), స్టబ్స్ (31 పరుగులు; 21 బంతుల్లో 3×4, 1×6) రాణించారు. ఆఖర్లో టీమ్ఇండియా బౌలర్లు విజృంభించడం వల్ల సౌతాఫ్రికాకు ఓటమి తప్పలేదు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్య 3, బుమ్రా 2, అర్ష్‌దీప్ సింగ్ 2, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశారు.