తెలంగాణ

telangana

ETV Bharat / sports

సూర్య వరల్డ్ రికార్డ్- ఆ ఘనత సాధించిన ఏకైక క్రికెటర్ - icc best t20 team 2023

T20 Player Of The Year 2023: టీమ్ఇండియా 360 డిగ్రీల బ్యాటర్ సూర్యకుమార్​ వరుసగా రెండోసారి టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్​గా ఎంపికయ్యాడు. 2023లో సూర్య ప్రదర్శనకుగాను ఐసీసీ బుధవారం ఈ అవార్డును ప్రకటించింది.

T20 Player Of The Year 2023
T20 Player Of The Year 2023

By ETV Bharat Telugu Team

Published : Jan 24, 2024, 3:25 PM IST

Updated : Jan 24, 2024, 3:48 PM IST

T20 Player Of The Year 2023:టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ '2023 టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్'​గా నిలిచాడు. 2023లో పొట్టి ఫార్మాట్​లో అత్యుత్తమ ప్రదకర్శన కనబర్చిన సూర్యను ఐసీసీ బుధవారం ప్లేయర్​ ఆఫ్ ది ఇయర్​గా ప్రకటించింది. కాగా, 2022లోనూ ఈ అవార్డు సూర్యనే వరించింది. దీంతో వరుసగా రెండుసార్లు ఉత్తమ టీ20 ప్లేయర్​ అవార్డు అందుకున్న ఏకైక క్రికెటర్​గా నిలిచాడు సూర్య. అటు టీ20 ర్యాకింగ్స్​లోనూ సూర్య అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం 869 రేటింగ్స్​తో సూర్య టాప్​లో ఉన్నాడు.

సూర్య@2023: 2023 ఏడాదికిగాను ఉత్తమ టీ20 క్రికెటర్ల రేసులో సూర్యతోపాటు జింబాబ్వే ప్లేయర్ సికిందర్ రజా (515 పరుగులు, 17 వికెట్లు), న్యూజిలాండ్ బ్యాటర్ మార్క్ చాప్​మన్ (576 పరుగులు) ఉగాండ ఆటగాడు అల్పేశ్ ( 55 వికెట్లు) ఉన్నారు. వీళ్లలో సూర్యనే ఈ అవార్డు వరించింది. గతేడాది పొట్టి ఫార్మాట్​లో సూర్య అదరగొట్టాడు. అతడు 17 ఇన్నింగ్స్​ల్లో 48 సగటుతో 733 పరుగులు బాదాడు. అందులో రెండు సెంచరీలు ఉన్నాయి. అతడి స్ట్రైక్ రేట్ 155గా ఉంది. అలాగే 2023లో సూర్య రెండు టీ20 సిరీస్​లకు టీమ్ఇండియా కెప్టెన్​గా వ్యవహరించాడు. ఆస్ట్రేలియాతో 4-1 తేడాతో సిరీస్ నెగ్గగా, సౌతాఫ్రికాతో 1-1తో డ్రా గా ముగిసింది.

ICC T20 Cricketer Of The Year: ఐసీసీ 2021 నుంచి క్రికెటర్లకు ఉత్తమ టీ20 అవార్డులు ఇస్తోంది. అయితే 2021లో పాకిస్థాన్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ ఈ అవార్డుకు ఎంపికవ్వగా, 2022, 2023లో వరుసగా రెండుసార్లు సూర్య దక్కించుకున్నాడు.

Surya Kumar Yadav ICC T20 Team:ఐసీసీ రీసెంట్​గా ఉత్తమ టీ20 జట్టును ప్రకటించింది. ఐసీసీ ఆ జట్టుకు సూర్యకుమార్​ను కెప్టెన్​గా ఎంపికచేసింది. ఇక ఆ జట్టులో టీమ్ఇండియా యంగ్ ప్లేయర్లు యశస్వి జైస్వాల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్‌ సింగ్​కు చోటు దక్కింది. దీంతో 2023 టీ20 ఉత్తమ జట్టులో నలుగురు భారత ఆటగాళ్లు స్థానం దక్కించుకున్నారు.

2023 ఉత్తమ టీ20 జట్టు:సూర్యకుమార్ యాదవ్‌ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, నికోలస్‌ పూరన్, ఫిల్ సాల్ట్, సికిందర్‌ రాజా, మార్క్‌ చాప్‌మన్, మార్క్‌ ఐదెర్, రవి బిష్ణోయ్‌, రామ్‌జని, అర్ష్‌దీప్‌ సింగ్‌, రిచర్డ్‌ ఎన్‌గరవ.

ICC టీ20 టీమ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ - కెప్టెన్​గా సూర్య భాయ్​

రవిశాస్త్రికి బీసీసీఐ అరుదైన పురస్కారం- శుభ్​మన్​ గిల్​కు పాలి ఉమ్రిగర్​ అవార్డు

Last Updated : Jan 24, 2024, 3:48 PM IST

ABOUT THE AUTHOR

...view details