Surya Kumar Yadav Love Story :సినీ తారలదే కాదు క్రికెటర్ల పర్సనల్ విషయాల గురించి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి కనబరుస్తుంటారు. తమ ఫేవరట్ స్టార్స్ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంది. వాళ్లు ఎటువంటి స్వీట్ మూమెంట్స్‌ను ఎంజాయ్ చేస్తున్నారో తెలుసుకోవాలనుకుంటారు. ఇక తమ అభిమానుల కోసం ఆ స్టార్స్ కూడా అప్పుడప్పుడు తమ లైఫ్‌లో జరిగే స్పెషల్ మూమెంట్స్‌ను నెట్టింట షేర్ చేస్తుంటారు. తమ వెడ్డింగ్ ఫొటోస్, యానివర్సరీ ఫొటోస్, తమ పిల్లల ఫొటోస్ ఇలా కొన్నింటినీ అప్లోడ్ చేస్తుంటారు. అంతే కాకుండా ఇంటర్వ్యూల్లోనూ తమ పర్సనల్ లైఫ్ గురించి క్రికెటర్లు కొన్ని సార్లు ఓపెనప్ అవుతుంటారు. అలా ఒకానొక సందర్భంలో మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ కూడా తన లవ్ లైఫ్ గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు.
ముంబయిలోని ఆర్.ఏ పోదర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ & ఎకనామిక్స్ కళాశాలలో ఈ జంట ప్రేమ ప్రయాణం మొదలైంది. సూర్య బీకామ్ మొదటి సంవత్సరం చదువుతుండగా, దేవీషా అప్పుడే ఇంటర్ పూర్తి చేసి అదే కాలేజీలో జాయిన్ అయ్యింది. అప్పటికే దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తున్నాడు సూర్య.
ఇక ఫ్రెషర్స్ పార్టీలో దేవీషాను చూడటం, దేవిషా గ్రౌండ్‌లో సూర్యను చూడటం ఇదంతా సినిమాటిక్‌గా సాగిపోయాయి. అయితే కొద్ది రోజులకే ఒక మిత్రుడి ద్వారా దేవిషాకు మన సూర్యకుమార్ పరిచయమయ్యాడు. ఇక ఈ ఇద్దరూ కాలేజీ బయట కలుసుకోవడం, మాట్లాడుకోవడం లాంటివి ప్రారంభమయ్యాయి. ఈ జర్నీలో వాళ్లు ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడం ప్రారంభించారు. సోషల్ మీడియాలో చాటింగ్ ద్వారా మరింత దగ్గరయ్యారు. అలా నాలుగేళ్ల పాటు వీరి లవ్ స్టోరీ సాగింది.
ఇదిలా ఉండగా, దేవీషా మంచి డ్యాన్స్ కోచ్‌గా పేరు సంపాదించుకున్నారు. సూర్య కుమార్ కూడా నేషనల్ జట్టులో స్థానం సంపాదించేందుకు ప్రయత్నాలు మొదలెట్టాడు. 2012లో టీ20 లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ 2015 వరకు అతడికి సరైన గుర్తింపు రాలేదు. అదే ఏడాది ముంబయితో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా తరఫున ఆడిన ఈ స్టార్ క్రికెటర్ కేవలం 20 బంతుల్లోనే 5 సిక్సర్లతో 46 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. దీంతో అప్పటి వరకు దేశవాళీ క్రికెట్‌కే పరిమితమైన అతడి పాపులారిటీ ఒక్కసారిగా టీ20ల్లోనూ వచ్చేసింది.