తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారీగా పెరిగిన SRH రెవెన్యూ- ఏకంగా రూ.659 కోట్లు! - Sunrisers Hyderabad Revenue

Sunrisers Hyderabad Revenue: 2024 ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రన్నరప్‌గా నిలిచింది. సన్‌ నెట్‌వర్క్ మరో ఫ్రాంచైజీ అయిన ఈస్టర్న్ కేప్ వరుసగా రెండో టైటిల్‌ గెలిచింది. దీంతో SRH ఫ్రాంచైజీ రెవెన్యూ భారీగా పెరిగింది.

SRH Revenue
SRH Revenue (Source: ETV Bharat)

By ETV Bharat Sports Team

Published : Sep 5, 2024, 7:19 PM IST

Sunrisers Hyderabad Revenue:2024 ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (SRH) అదిరే ఆటతో ఫైనల్​ వరకు వెళ్లినా రన్నరప్​తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సీజన్‌ మొత్తం సంచలన ప్రదర్శనలు చేసిన సన్‌రైజర్స్‌ టీమ్‌ ఫైనల్లో ఆకట్టుకోలేకపోయింది. టైటిల్‌కి ఒక్క అడుగు దూరంలో ఆగిపోయింది. అయితే ఈ సీజన్​ ప్రదర్శన ఫ్రాంచైజీకి భారీ ఆదాయం తెచ్చి పెట్టింది. సన్‌రైజర్స్ హైదరాబాద్, ఈస్టర్న్ కేప్ ఫ్రాంచైజీల యజమానులైన సన్ టీవీ నెట్‌వర్క్ 2024లో తమ ఆదాయంలో 138% వృద్ధిని సాధించింది.

కంపెనీకి ప్రధానంగా ఫ్రాంచైజీల ద్వారానే ఆదాయం వచ్చింది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఐపీఎల్‌, SA20 ఫ్రాంచైజీల రెవెన్యూ రూ.276 కోట్ల నుంచి రూ.659 కోట్లకు పెరిగింది. గత సీజన్‌లో సన్​రైజర్స్​ రన్నరప్‌గా నిలవగా, ఈస్టర్న్ కేప్ వరుసగా రెండుసార్లు SA20 టైటిల్‌ను ఎగరేసుకుపోయింది.

రెవెన్యూలో భారీ పెరుగుదల
కొన్ని నివేదికల ప్రకారం, రెవెన్యూ పెరగడానికి సెంట్రల్ రెవెన్యూ పూల్ నుంచి ఆదాయం కూడా సహాయపడింది. అంతేకాకుండా డిస్నీ, వయాకామ్ 18 మధ్య మీడియా హక్కుల ఒప్పందం కూడా ఫ్రాంచైజీ యజమానుల ఆదాయాన్ని పెంచింది. క్రికెట్ జట్ల నుంచి వచ్చే ఆదాయం భవిష్యత్తులో పెరుగుతూనే ఉంటుందని, ఐపీఎల్, SA20 రాబోయే ఎడిషన్‌లలో తమ జట్లకు పూర్తి సపోర్ట్‌ ఉంటుందని సన్ టీవీ నెట్‌వర్క్ పేర్కొంది

దెబ్బతిన్న IPL బ్రాండ్!
2008లో ప్రారంభమైన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ అనంతరం ప్రపంచంలోనే రిచెస్ట్‌ క్రికెట్‌ లీగ్‌గా ఎదిగింది. అంతేకాకుండా రిచెస్ట్‌ స్పోర్ట్స్‌ లీగ్‌ల జాబితాలో టాప్ ఫైవ్‌లో చేరింది. కానీ ఈ సారి ఐపీఎల్ దాని విలువలో 11.7% క్షీణతను చూసింది. ఇటీవల మీడియా హక్కులకు చేసిన సవరణల కారణంగా లీగ్ వ్యాపారం రూ.92,500 కోట్ల నుంచి రూ.82,700 కోట్లకు తగ్గింది. ప్రస్తుతం డిస్నీ స్టార్, వయాకామ్18, IPL టీవీ, డిజిటల్ హక్కులు రూ.48,390 కోట్లకు కలిగి ఉన్నాయి. త్వరలో ఈ రెండు సంస్థలు విలీనం కానున్నాయి. ఈ విలీనం భవిష్యత్తులో బిడ్డింగ్‌కి పోటీని తగ్గించే అవకాశం ఉంది.

విలువైన ఫ్రాంచైజీ
నివేదికల ప్రకారం, ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో అత్యధిక విలువ కలిగిన ఫ్రాంచైజీగా ముంబయి ఇండియన్స్‌ నిలిచింది. తర్వాత స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్‌ నిలిచింది. అలానే మునుపటి ఎడిషన్‌తో పోలిస్తే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) విలువ రూ.1,250 కోట్ల నుంచి రూ.1,350 కోట్లకు పెరిగింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 8% వృద్ధిని నమోదు చేసింది.

బీసీసీఐకి జాక్​పాట్.. రూ.48,390 కోట్లకు ఐపీఎల్ మీడియా​ రైట్స్​

బీసీసీఐతో ఫ్రాంచైజీల మీటింగ్​ - ఐపీఎల్ షెడ్యూల్​ ఛేంజ్​! - IPL Franchise Meeting

ABOUT THE AUTHOR

...view details