ETV Bharat / offbeat

డోర్ మ్యాట్స్ ఇలా క్లీన్ చేయండి - ఎంతటి మురికివైనా నిమిషాల్లో కొత్తవాటిలా మారుతాయి!

డోర్ మ్యాట్స్ క్లీనింగ్ కష్టంగా ఫీలవుతున్నారా? - ఇలా వాష్ చేస్తే పదే పది నిమిషాల్లో తళతళా మెరిపించవచ్చట!

Washing Tips for Door Mats
HOW TO CLEAN DOOR MATS (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 19 hours ago

Best Washing Tips for Door Mats : ఇల్లు శుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇందుకోసమే తరచూ శుభ్రం చేయడం, ఎప్పటికప్పుడు వస్తువుల దుమ్ము దులపడం.. ఇలాంటివెన్నో చేస్తుంటాం. కానీ, కొన్ని రకాల వస్తువుల క్లీనింగ్ విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటాం. అలాంటి వాటిల్లో ఒకటి.. డోర్ మ్యాట్స్. కొంతమంది ఇంట్లోకి స్వాగతం పలికే ఈ మ్యాట్స్​ని క్లీన్ చేయకుండా రోజుల తరబడి యూజ్ చేస్తుంటారు. అయితే, డోర్ మ్యాట్స్​ని శుభ్రం చేయకుండా ఎక్కువ రోజులు అలాగే వాడడం వల్ల వాటిపై దుమ్ము-ధూళి చేరి మురికిగా కనిపిస్తుంటాయి.

పైగా అలాంటి వాటి వల్ల శ్వాసకోశ, చర్మ సంబంధిత అలర్జీలు వంటి పలు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. కాబట్టి, తరచుగా ఇంటిని శుభ్రం చేసుకోవడం మాత్రమే కాదు.. డోర్ మ్యాట్స్​ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. అయితే, చాలా మంది వీటిని వాష్ చేయడం కష్టంతో కూడుకున్న పనిగా భావిస్తుంటారు. అలాంటి వారికోసమే కొన్ని సూపర్ టిప్స్ తీసుకొచ్చాం. వాటిని ఫాలో అయ్యారంటే చాలా ఈజీగా పదే పది నిమిషాల్లో డోర్ మ్యాట్స్ మురికిని వదలగొట్టి కొత్తవాటిలా మెరిపించవచ్చంటున్నారు! ఇంతకీ, ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

వేడి నీటితో ఇలా చేయండి : డోర్ మ్యాట్స్ క్లీనింగ్ విషయంలో ఈ పద్ధతి చాలా బాగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం ముందుగా ఒక వెడల్పాటి బకెట్​లో తగినన్ని వేడి నీటిని తీసుకోవాలి. ఆపై మీరు శుభ్రం చేయాలనుకుంటున్న మ్యాట్స్​ను అందులో అవి మునిగేలా వేసి అరగంటపాటు నాననివ్వాలి. అనంతరం మరో బకెట్​లో నార్మల్ వాటర్​ తీసుకొని నానబెట్టుకున్న వాటిని బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా వాటిలో ఉండే సగం దుమ్ము, ధూళి తొలగిపోతాయి. తక్కువ దుమ్ము ఉన్నవైతే ఒక్కసారికే శుభ్రంగా క్లీన్ అవుతాయి. మురికి ఎక్కువగా ఉన్నట్లయితే ఈవిధంగా చేస్తే మొత్తం మురికి వదిలి కొత్తవాటిలా మెరుస్తాయంటున్నారు.

వెనిగర్/బేకింగ్ సోడా : పైన చెప్పిన విధంగా డోర్ మ్యాట్స్ వాష్ చేసుకున్నాక.. అదే బకెట్​లో మళ్లీ కొన్ని గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. ఆపై దానిలో 2 టేబుల్​స్పూన్ల డిటర్జెంట్ పౌడర్, బేకింగ్ సోడా లేదా వెనిగర్ వేసి కర్ర సహాయంతో బాగా మిక్స్ చేయాలి. అనంతరం అందులో కొద్దిగా డెటాల్ లిక్విడ్ వేసి మీరు క్లీన్ చేయాలనుకుంటున్న డోర్ మ్యాట్స్​ని గంటపాటు నానబెట్టుకోవాలి. అనంతరం నానబెట్టుకున్న డోర్ మ్యాట్స్​ని నార్మల్ వాటర్​తో బాగా శుభ్రం చేసుకుని ఎండలో ఆరబెట్టి యూజ్ చేస్తే చాలు! మురికిగా ఉన్న డోర్ మ్యాట్స్ దుమ్ము, ధూళి వదిలి అప్పుడే కొన్నవాటిలా కనిపిస్తాయంటున్నారు నిపుణులు.

ఇవీ చదవండి :

క్లీనింగ్ ప్రొడక్ట్స్​ కొనాల్సిన పని లేదు - ఇంట్లో ఇవి ఉంటే చిటికెలో దేన్నైనా తళతళా మెరిపించవచ్చు!

ఇంటి ఫ్లోర్​పై జిడ్డు మరకలు వదలట్లేదా? - ఈ టిప్స్ పాటిస్తే ఇట్టే తొలగిపోతాయి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.