Sunrisers Hyderabad IPL 2024: 2024 ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ దూకుడైన ఆటతో ప్లే ఆఫ్స్‌కు చేరింది. ఈ సీజన్లో బెదురు లేకుండా ఆడిన సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్‌కు దూసుకుపోయి క్వాలిఫయర్- 1కు అర్హత సాధించింది. ఇక మే 21 అహ్మదాబాద్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. ఈ క్రమంలో దాదాపు 5ఏళ్ల తర్వాత సన్‌రైజర్స్ తొలిసారి క్వాలిఫయర్- 1 ఆడనుంది. సన్‌రైజర్స్ చివరిసారిగా 2018లో కేన్ విలియయమ్సన్ కెప్టెన్సీలో క్వాలిఫయర్- 1 మ్యాచ్ ఆడింది.
కెప్టెన్ వల్లే!
అయితే సన్‌రైజర్స్ ఈ సీజన్ లీగ్ దశలో అనేక రికార్డులు కొల్లగొట్టింది. అవన్నీ ప్యాట్ కమిన్స్ నాయతక్వం వల్లే సాధ్యమయ్యాయని సన్‌రైజర్స్ ఫ్యాన్స్ అతడిపై ప్రసంశలు కురిపిస్తున్నారు. నిజానికి కమిన్స్ కెప్టెన్సీలోనే సన్‌రైజర్స్ అత్యంత పటిష్ఠంగా తయారైంది. ప్రత్యర్థి ఎవరైనా ఎదురు దాడికి దిగడమే తమ నైజం అన్నట్లుగా ఆడి మంచి ఫలితాలు సాధించింది. దీంతో జట్టుకు కెప్టెన్సీ వహించిన తొలి సీజన్లోనే క్వాలిఫయర్ -1కు చేర్చిన ఘనత కమిన్స్‌కు దక్కింది. ఇక నాకౌట్లోనూ అదరగొట్టి జట్టుకు టైటిల్ అందిస్తాడని సన్‌రైజర్స్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
వాళ్లిద్దరి తర్వాత: లీగ్ దశలో 14 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ 8 నెగ్గి, ఐదింట్లో ఓడింది. అందులో గుజరాత్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో 17 పాయింట్లు (+0.414 రన్‌రేట్)తో టాప్ 2 బెర్త్ దక్కించుకుంది. ఇక వార్నర్, విలియమ్సన్ తర్వాత సన్‌రైజర్స్‌ను ఇంక గొప్పగా నడిపించింది కమిన్సే. చెప్పాలంటే వాళ్లిద్దరి కన్నా టీమ్‌పై కమిన్స్ కెప్టెన్సీ ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇక వార్నర్ తర్వాత కమిన్సే జట్టుకు టైటిల్ అందిస్తాడని సన్‌రైజర్స్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.