Sunil Gavaskar On Team India Practice: అడిలైడ్ పింక్ బాల్ టెస్టులో భారత్ ఓటమిపై టీమ్ఇండియా మాజీ ప్లేయర్ సునీల్ గావస్కర్ స్పందించాడు. రెండో టెస్టు మూడు రోజుల్లోనే ముగిసినందున తర్వాతి మ్యాచ్ ప్రాక్టీస్‌కు రెండ్రోజులు ఎక్కువ సమయం దొరికిందని అన్నాడు. ఆటగాళ్లు హోటల్ రూమ్స్‌లో కూర్చొకుండా, నెట్స్‌లో దిగి ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలని కోరాడు. ఈ మేరకు గావస్కర్ మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించాడు.
'ఐదు మ్యాచ్‌ల సిరీస్ అని మర్చిపోయి దీన్ని మూడు టెస్టుల సిరీస్ అనుకోవాలి. ఈ టెస్టు మూడు రోజుల్లోనే కంప్లీట్ అయినందున, మరో రెండ్రోజులు ప్రాక్టీస్‌కు కలిసొచ్చింది. అది ఒక రకమైన అడ్వాంటేజ్. ఎవరు కూడా హోటల్ రూమ్స్‌లో ఖాళీగా కూర్చోవద్దు. బయటకు ఎక్కడికీ వెళ్లకూడదు. మనం ఇక్కడికి వచ్చింది క్రికెట్ ఆడడానికే అని ప్లేయర్లంతా గుర్తుంచుకోవాలి. రోజంతా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. ఉదయం లేదా మధ్యాహ్నం ఏదైనా ఒక సెషన్ షెడ్యూల్ చేసుకోండి. కానీ, సమయం వృథా చేయకండి. మళ్లీ ఫామ్ అందుకోవాలి'
'కొందరు ప్లేయర్లకు ప్రాక్టీస్ సెషన్ నుంచి మినహాయింపు ఇవ్వడాన్ని నేను అంగీకరించను. 'కోచ్ ఓ ప్లేయర్‌తో నువ్వు 150 పరుగులు చేశావు లేదా నువ్వు 40 ఓవర్లు బౌలింగ్ చేశావు' అని వాళ్లకు ప్రాక్టీస్ నుంచి మినహాయింపు ఇవ్వకూడదు. వాళ్లకు అలాంటి ఛాయిస్ ఇస్తే ఇతరులు కూడా ప్రాక్టీస్ చేయకుండా రూమ్‌లోనే ఉండిపోతారు. టీమ్ఇండియాలో ఇలాంటివి ఉండకూడదు. భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవం. రోహిత్, విరాట్ ప్రాక్టీస్ చేయకపోయినా ఫర్వాలేదు. వాళ్లకు అనుభవం ఉంది. ఇతరులు అయినా ప్రాక్టీస్ చేయాలి' అని గావస్కర్ పేర్కొన్నాడు. కాగా, ఇరుజట్ల మధ్య మూడో టెస్టు డిసెంబర్ 14న ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు బ్రిస్బేన్ వేదిక కానుంది.