SRH Retained Players 2025 :2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మెగా వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) రిటైన్ చేసుకొనే ఆటగాళ్ల జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం. ఐపీఎల్ వేలానికి సంబంధించిన రిటెన్షన్ నిబంధనలను ఇటీవల బీసీసీఐ ఖరారు చేసింది. మొత్తంగా ఒక్కో ఫ్రాంచైజీ గరిష్ఠంగా ఆరుగురు ప్లేయర్లను అట్టిపెట్టుకోవడానికి అనుమతి ఇచ్చింది. మరి సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ ఎవరెవరిని అట్టిపెట్టుకునే ఛాన్స్ ఉందంటే?
రూ.23 కోట్లకు హెన్రిచ్ క్లాసెన్?
దక్షిణాఫ్రికా వికెట్ కీపర్- బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్‌ను రాబోయే సీజన్‌కి తొలి ఆప్షన్‌గా తీసుకోవాలని భావిస్తోంది. తొలి ఆప్షన్‌గా రిటైన్ చేసిన ఆటగాడికి బీసీసీఐ రూ.18 కోట్ల ధరను నిర్ణయించింది. అయినా క్లాసెన్ కోసం రూ.23 కోట్లు చెల్లించడానికి ఫ్రాంచైజీ సిద్ధంగా ఉందని సమాచారం. 2024లో క్లాసెన్ అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. 15 ఇన్నింగ్స్‌ల్లో 171.07 స్ట్రైక్ రేట్‌తో 479 పరుగులు చేశాడు.
మిగతా ఇద్దరు వాళ్లే!
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్, యంగ్ బ్యాటర్ అభిషేక్ శర్మను కూడా రిటైన్ చేయాలని SRH నిర్ణయించుకుందట. జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన కమిన్స్‌ను రూ.18 కోట్లకు అట్టిపెట్టుకొని, అభిషేక్ కోసం రూ.14 కోట్లు వెచ్చించడానికి రెడీ అయిపోయిందని తెలుస్తోంది. గత సీజన్‌లో కమిన్స్ 18 వికెట్లతో సత్తా చాటగా, 2024 సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లలో అభిషేక్ ఒకడు. ఏకంగా 204.21 స్ట్రైక్ రేట్‌తో 484 పరుగులు చేశాడు. ఓపెనర్‌గా జట్టుకి కళ్లు చెదిరే ఆరంభాలు అందించాడు.