Sourav Ganguly Phone : టీమ్ఇండియా మాజీ స్టార్ క్రికెటర్ సౌరభ్ గంగూలీ మొబైల్ ఫోన్ ఇటీవలే చోరీకి గురైంది. కోల్‌కతాలోని ఆయన నివాసంలో ఈ ఘటన జరిగింది. వెంటనే ఆయన ఈ ఘటనపై శనివారం ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తన ఫోన్‌లోని వ్యక్తిగత డేటా భద్రతపై ఆయన ఆందోళన చెందుతున్నారు. మరోవైపు గంగూలీ స్మార్ట్ ఫోన్ విలువ సుమారు రూ.1.6 లక్షలు ఉంటుందని సమాచారం.
ఇంతకీ ఏం జరిగిందంటే ?
బెహలాలోని తన నివాసానికి ప్రస్తుతం పెయింటింగ్ పని చేయిస్తున్నారు. అయితే తన ఫోన్‌ను ఇంట్లో పెట్టి బయటకు వెళ్లారు. ఆయన తిరిగి వచ్చే సరికి అది కనిపించకుండా పోయింది. ఇల్లంతా గాలించినా కూడా ఆ ఫోన్ ఎక్కడా కనిపించలేదు. దీంతో వెంటనే గంగూలీ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు. ఆ ఫోన్‌లో ఆయన వ్యక్తిగత సమాచారం, ఇతర కీలక డేటా ఉండటం వల్ల ఆందోళన గంగూలీ వ్యక్తం చేశారు. అది దుర్వినియోగం కాకుండా త్వరగా ఫోన్‌ను రికవరీ చేయాలని పోలీసులు కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టారు. ఇంట్లో పని చేస్తున్న వారిని ఈ మేరకు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.