Smriti Mandhana Record :భారత స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన కెరీర్లో మరో అరుదైన ఘనత సాధించింది. వన్డే ఫార్మాట్ క్రికెట్‌లో అత్యంత వేగంగా 4000 పరుగుల మార్క్ అందుకున్న భారత తొలి మహిళా ప్లేయర్‌గా రికార్డు సృష్టించింది. మంధాన 95 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్ సాధించింది. శుక్రవారం ఐర్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 40 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద స్మృతి ఈ మైలురాయి అందుకుంది.
కాగా, మహిళల క్రికెట్‌లో భారత్ నుంచి మంధాన ఈ ఫీట్ సాధించిన రెండో ప్లేయర్‌గా నిలిచింది. మాజీ ప్లేయర్ మిథాలీ రాజ్ (112 ఇన్నింగ్స్), మంధాన కంటే ముందు 4000 పరుగుల మార్క్ టచ్ చేసింది. ఓవరాల్‌గా వన్డేల్లో 4000+ పరుగులు సాధించిన 15వ ప్లేయర్‌గా మంధాన నిలిచింది. ఇక వరల్డ్‌వైడ్‌గా అత్యంత వేగంగా ఈ మైలురాయి అందుకున్న మూడో ప్లేయర్‌గా ఘనత సాధించింది.
ఓవరాల్‌గా వన్డేల్లో వేగంగా 4000+ మార్క్ అందుకున్న ప్లేయర్లు
- బెలిండా క్లార్క్ (ఆస్ట్రేలియా) - 86 ఇన్నింగ్స్
- మెగ్ లాన్నింగ్ (ఆస్ట్రేలియా) - 87 ఇన్నింగ్స్
- స్మృతి మంధాన (భారత్) - 95 ఇన్నింగ్స్‌లు
- లారా వోల్వార్డ్ (సౌతాఫ్రికా) - 96 ఇన్నింగ్స్
- కరేన్ రోల్టన్ (ఆస్ట్రేలియా) - 103 ఇన్నింగ్స్
- సుజీ బీట్స్ (న్యూజిలాండ్) - 105 ఇన్నింగ్స్