Shuttler Sai Praneeth Retirement : భారత బ్యాడ్మింటన్ స్టార్, హైదరాబాద్ ప్లేయర్ భమిడిపాటి సాయి ప్రణీత్ ఆటకు రిటైర్మెంట్ పలికిన సంగతి తెలిసిందే. ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్‌కు అతడు వీడ్కోలు పలికాడు. దీంతో చాలా మంది షాక్ అయ్యారు. త్వరలోనే అమెరికాలోని ట్రయాంగిల్ బ్యాడ్మింటన్ అకాడమీ ప్రధాన కోచ్‌గా కొత్త ప్రయాణాన్ని మొదలెట్టబోతున్నాడు. ఈ నేపథ్యంలో అతడి సాధించిన రికార్డులు, కెరీర్ ఎలా సాగిందో తెలుసుకుందాం.
Shuttler Sai Praneeth Records :
- 2010 ప్రపంచ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చి అందరి దృష్టిని ఆకర్షించాడు ప్రణీత్.
- అయితే ఈ ప్రపంచ జూనియర్ ఛాంపియన్‌షిప్ మెడల్‌ను సాధించడం కన్నా ముందే అతడు 2008 కామన్వెల్త్ యూత్ క్రీడల్లో డబుల్స్ కాంస్యం కూడా అందుకున్నాడు
- సీనియర్ స్థాయిలోనూ సాయి ప్రణీత్ తన ప్రతిభతో సత్తాచాటా అందరి దృష్టిని మరింత ఆకట్టుకున్నాడు.
- 2017 సింగపూర్ ఓపెన్ టైటిల్‌ను దక్కించుకుని తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నాడు.
- సైనా నెహ్వాల్, పీవీ సింధు, శ్రీకాంత్‌లు కూడా ఈ సిరీస్‌లు గెలుచుకున్న సంగతి తెలిసిందే. వీరి తర్వాత ఈ సూపర్ సిరీస్ టోర్నీలో విజయం సాధించిన నాలుగో భారత షట్లర్‌గా నిలిచాడు.
- అయితే 2019 స్విస్ ఓపెన్ ఫైనల్లో మనోడికి నిరాశ ఎదురైంది. ఓటమి చెందాడు.
- కానీ అదే ఏడాది 2019 వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో అదరగొట్టాడు ప్రణీత్. కాంస్యంతో 36 ఏళ్ల భారత నిరీక్షణకు తెరదించాడు. ప్రకాశ్ పదుకొనె (1983) తర్వాత ప్రపంచ ఛాంపియన్‌షిప్స్ పురుషుల సింగిల్స్‌లో భారత్‌కు కాంస్యం దక్కింది ప్రణీతే వల్లే.
- ఆ తర్వాత శ్రీకాంత్, లక్ష్యసేన్, ప్రణయ్ కూడా ఈ మెడల్స్‌ను ముద్దాడారు.
- ఇక 2019లోనే అర్జున పురస్కారాన్ని ముద్దాడాడు ప్రణీత్. అనంతరం టోక్యో ఒలింపిక్స్‌లోనూ దేశానికి ప్రాతినిథ్యం వహించాడు.
- ప్రపంచ ర్యాంకింగ్స్‌లోనూ తన బెస్ట్ పెర్ఫామెన్స్ వల్ల పదో స్థానంలో నిలిచాడు. మెన్స్ టీమ్ తరపున ఆసియా టీమ్ ఛాంపియన్‌షిప్స్‌లో రెండు కాంస్యాలను దక్కించుకుని మరోసారి సత్తా చాటాడు.
- అయితే కరోనా విరామం అతడికి ప్రతికూలంగా మారింది. ఆ తర్వాత అతడు తిరిగి పుంజుకోలేకపోయాడు. గాయాల కారణంగా కూడా బాగానే వెనకబడ్డాడు. టాప్-100 లోపు ర్యాంకు కోల్పోవాల్సి వచ్చింది. చివరగా నిరుడు గువాహటి మాస్టర్స్ టోర్నీ బరిలో దిగి అతడు ఆడాడు.