Ranji Trophy Shreyas Iyer Injured : టీమ్ ఇండియాలోకి కమ్ బ్యాక్ ఇవ్వాలని గట్టిగా ప్రయత్నిస్తున్న శ్రేయస్ అయ్యర్‌కు ఎదురు దెబ్బ తగిలింది! రంజీ ట్రోఫీలో భాగంగా త్రిపురతో జరగబోయే మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉండట్లేదని తెలిసింది. ఈ విషయాన్ని ముంబయి క్రికెట్ అసోసియేషన్ (ఎమ్సీఏ)లోని ఓ పెద్ద అధికారి ఈటీవీ భారత్‌తో తెలిపారు. అయితే శ్రేయస్ ఈ మధ్య వరుస మ్యాచులు ఆడటం వల్ల రెస్ట్ తీసుకునేందుకు త్రిపురతో మ్యాచ్‌కు దూరమవుతున్నాడని కొంత మంది అంటున్నారు.
గాయపడ్డాడా? - ఇదే సమయంలో అయ్యర్ మరోసారి గాయపడ్డాడని ఇంగ్లీష్ కథనాలు వస్తున్నాయి. శ్రేయస్ భుజానికి దెబ్బ తగిలిందట. దీంతో అతడు వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారట. దీంతో అతను ముంబయి నెక్ట్స్ ఆడబోయే రంజీ మ్యాచ్‌కు దూరం కానున్నాడని చెబుతున్నారు. రంజీల్లో రాణించి భారత జట్టులో చోటు దక్కించుకోవాలని భావిస్తున్న శ్రేయస్‌కు గాయాలు పెద్ద సమస్యగా మారాయని అంటున్నారు.
కాగా, ముంబయి ఈ నెల 26న త్రిపురతో పోటీ పడనుంది. ఈ రంజీ ట్రోఫీలో బరోడాపై ఓటమితో మొదలు పెట్టిన ముంబయి, గత రంజీ మ్యాచ్‌ను మహారాష్ట్రపై ఆడింది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ గ్రౌండ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబయి 9 వికెట్లతో విజయం సాధించి గట్టి కమ్ బ్యాక్ ఇచ్చింది. ఈ పోరులో అయ్యర్ 142 పరుగులు విన్నింగ్ సెంచరీతో మెరిశాడు. ఈ రంజీ సీజన్లో ఇప్పటివరకు అతడు మూడు ఇన్నింగ్స్‌లు ఆడి 57.33 సగటున 172 పరుగులు సాధించాడు. బరోడాతో జరిగిన సీజన్ తొలి మ్యాచ్‌లో 0, 30 పరుగులు చేశాడు.