Shikhar Dhawan India Dressing Room :టీమ్ఇండియా మాజీ ప్లేయర్ శిఖర్ ధావన్ తాజాగా జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో సందడి చేశాడు. దుబాయ్ వేదికగా పాకిస్థాన్‌తో మ్యాచ్ అనంతరం, బెస్ట్ ఫీల్డర్ విన్నర్‌ను ప్రకటించడానికి కోచ్ దిలీప్ శిఖర్ ధావన్‌ను టీమ్ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌లోకి ఆహ్వానించారు. భారత ఆటగాళ్లు చప్పట్లు కొడుతూ ధావన్‌ను స్వాగతం పలికారు. హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా అతడిని హాగ్ చేసుకున్నారు. అనంతరం శిఖర్ ఆటగాళ్లతో ముచ్చటించాడు.
ముందుగా ఘన విజయం సాధించిన టీమ్ఇండియాకు శుభాకాంక్షలు తెలిపాడు. ముఖ్యంగా బంతితో అదరగొట్టిన బౌలింగ్ యూనిట్‌ను, బ్యాటింగ్‌లో అదరగొట్టిన విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్‌ను ధావన్ అభినందించాడు. జట్టులోని సీనియర్లు, సపోర్టింగ్ టీమ్‌ను కూడా మెచ్చుకున్నాడు. ఇక తనను డ్రెస్సింగ్ రూమ్‌లోకి ఆహ్వానించినందుకు థాంక్స్ చెప్పాడు. చివరకు అక్షర్ పటేల్‌ను బెస్ట్ ఫీల్డర్‌గా ప్రకటించి మెడల్‌ను బహుకరించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అక్షర్ కీలక పాత్ర
ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అక్షర్ పటేల్ ఒక వికెట్తోపాటు ఓ క్యాచ్ పట్టి రెండు రనౌట్‌లు చేశాడు. ఇమామ్ ఉల్ హక్ (10) షార్ట్ కవర్స్ వైపు బంతిని ఆడి కొంచెం నెమ్మదిగా కదిలాడు. అక్షర్ చురుగ్గా కదిలి వికెట్ల పైకి డైరెక్ట్ త్రో విసరడం వల్ల ఇమామ్ పెవిలియన్ చేరాడు. తర్వాత రిజ్వాన్ (46)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. కాసేపటికే హార్దిక్ బౌలింగ్ బౌలింగ్‌లో సౌద్ షకీల్ (62) ఇచ్చిన క్యాచ్‌ను అందుకున్నాడు. హారిస్ రవూఫ్ (8) రనౌట్‌లోనూ అక్షర్ కీలకంగా వ్యవహరించాడు.