Shashank Singh IPL 2024:2024 ఐపీఎల్లో తాజాగా మరో సంచలన ఆటగాడు వెలుగులోకి వచ్చాడు. గురువారం నాటి మ్యాచ్‌లో యువ ఆటగాడు శశాంక్ సింగ్ విరోచిత ఇన్నింగ్స్‌తో గుజరాత్‌పై పంజాబ్ నెగ్గింది. ఈ మ్యాచ్‌లో యంగ్ బ్యాటర్ శశాంక్ మెరుపు హాఫ్ సెంచరీ (61 పరుగులు, 29 బంతుల్లో: 6x4, 4x6)తో మరో బంతి మిగిలుండగానే పంజాబ్‌కు విజయాన్ని కట్టబెట్టాడు. అయితే ఆశల్లేని స్థితిలో ఉన్న పంజాబ్‌ను తన అద్భుత బ్యాటింగ్‌తో విజయ తీరాలకు చేర్చిన శశాంక్ పట్ల ఆ జట్టు ప్లేయర్లు వ్యవహరించిన తీరు నెటిజన్లకు కోపం తెప్పిస్తోంది.
200 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్ పీకల్లోతూ కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన శశాంక్ బౌండరీలే లక్ష్యంగా ఆడాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా అతడు మాత్రం స్కోర్ బోర్డును ముందుకు నడింపించాడు. ఈ క్రమంలో శశాంక్ 25 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు.అయితే ఆ సమయంలో పంజాబ్ విజయానికి ఇంకా 31 పరుగులు కావాల్సి ఉన్నందున శశాంక్ తన తొలి ఐపీఎల్ ఫిఫ్టీని పెద్దగా సెలబ్రేట్ చేసుకోలేదు.
కానీ, డగౌట్లో ఉన్న పంజాబ్ ప్లేయర్లు, సిబ్బంది కూడా అతడి ఇన్నింగ్స్‌ను మెచ్చుకోలేదు. ఏ మాత్రం ప్రోత్సాహం అందించకుండా, కనీసం చప్పట్లు కూడా కొట్టలేదు. టీమ్ సిబ్బంది అంతా ఎలాంటి సంబరాలు లేకుండా సైలెంట్‌గా కూర్చున్నారు. దీంతో నెటిజన్లు వారి ప్రవర్తనపై మండి పడుతున్నారు. శశాంక్ 'కష్టపడి మ్యాచ్‌లో పోరాడితే అతడి ఇన్నింగ్స్‌కు కనీసం చప్పట్లు కూడా కొట్టరా' అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.