తెలంగాణ

telangana

ETV Bharat / sports

పాకిస్థాన్​ను వదిలిన సర్ఫరాజ్- ఫ్యామిలీతో లండన్​కు షిఫ్ట్- కారణం ఏంటంటే?

Sarfaraz Ahmed Leaves Pakistan: పాకిస్థాన్ ప్లేయర్ సర్ఫరాజ్ ​అహ్మద్ కరాచీ వదిలి లండన్​కు వలస వెళ్లాడు. ఫ్యూచర్​ కెరీర్​ను దృష్టిలో ఉంచుకొని సర్ఫరాజ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Sarfaraz Ahmed Leaves Pakistan
Sarfaraz Ahmed Leaves Pakistan

By ETV Bharat Telugu Team

Published : Jan 20, 2024, 5:25 PM IST

Sarfaraz Ahmed Leaves Pakistan:పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ ​అహ్మద్​ ఇంగ్లాండ్​కు వలస వెళ్లాడు. పాకిస్థాన్ జాతీయ జట్టులో భవిష్యత్​ ఉండదన్న ఉద్దేశంతో సర్ఫరాజ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా కరాచి నుంచి ఫ్యామిలీతో సహా సర్ఫరాజ్​ లండన్​కు మకాం మర్చాడు. అయితే పాకిస్థాన్​ క్రికెట్ జట్టుతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే పీఎస్​ఎల్ (PSL) సీజన్ 9లో ఆడనున్నట్లు సమాచారం. కాగా, పీఎస్ఎల్​లో సర్ఫరాజ్ క్వాట్టా గ్లాడియేటర్స్​ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

Sarfaraz International Career:36 ఏళ్ల సర్ఫరాజ్ రీసెంట్​గా టెస్టు సిరీస్​ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాడు. పెర్త్​ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్​లో సర్ఫరాజ్ బరిలో దిగాడు. ఈ మ్యాచ్​లో కేవలం ఏడు పరుగులే చేశాడు. దీంతో అతడి స్థానాన్ని జట్టు మేనేజ్​మెంట్ మహ్మద్ రిజ్వాన్​తో రిప్లేస్ చేసింది. ఇక 2007లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సర్ఫరాజ్, కెరీర్​లో 54 టెస్టులు, 117 వన్డేలు, 63 టీ20 మ్యాచ్​ల్లో పాకిస్థాన్​ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. టెస్టుల్లో 3031 , వన్డేల్లో 2315 , టీ20ల్లో 818 పరుగులు చేశాడు. అందులో టెస్టు (4), వన్డే (2)ల్లో కలిపి 6 సెంచరీలు ఉన్నాయి. 2006లో అండర్​- 19 టోర్నీలో పాక్​కు నాయకత్వం వహించిన సర్ఫరాజ్ జట్టుకు టైటిల్ అందించాడు.

Sarfaraz Captaincy:2017 ఛాంపియన్స్​ ట్రోఫీలో పాకిస్థాన్​కు కెప్టెన్​గా వ్యవహరించాడు. ఈ టోర్నమెంట్​లో సర్ఫరాజ్​ పాక్​ను విజేతగా నిలిపాడు. ఫైనల్​లో పాకిస్థాన్, భారత్​పై 180 పరుగుల తేడాతో నెగ్గింది. ఇక టీ20ల్లోనూ కెప్టెన్​గా సర్ఫరాజ్ మంచి రికార్డు ఉంది. 37 మ్యాచ్​ల్లో 29 సార్లు జట్టును గెలిపించిన కెప్టెన్​గా నిలిచాడు.

Sarfaraz Wicket Keeping:అత్యధిక వికెట్లలో భాగస్వామ్యం పంచుకున్న కీపర్​గాను సర్ఫరాజ్​కు రికార్డ్ ఉంది. అతడు మూడు ఫార్మాట్​లలో 232 మ్యాచ్​ల్లో 371 డిస్మిసల్స్​ చేశాడు. ఇక 2021 ఏప్రిల్​లో సౌతాఫ్రికాపై చివరి వన్డే ఆడిన సర్ఫరాజ్ అదే ఏడాది నవంబర్​లో బంగ్లాదేశ్​పై టీ20 మ్యాచ్​ ఆడాడు.

PCB ఛైర్మన్ పదవికి అష్రఫ్ రాజీనామా- వరుస వైఫల్యాలే కారణం!

షోయబ్ మాలిక్ 'మూడో పెళ్లి'- సానియా పరిస్థితేంటి?

ABOUT THE AUTHOR

...view details