How to Stop Child Phone Addiction : సెల్‌ఫోన్ మన జీవితంలో ఒక భాగమైపోయింది. ఎంతలా అంటే పడుకుని లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకొనే వరకు మన తోనే ఉంటుంది. మళ్లీ పడుకున్న తర్వాత మన పక్కనే ఉంటుంది. క్షణానికి ఒక్కసారైనా బుల్లి సెల్‌ఫోన్‌ను చూడందే నిద్రపట్టదు. ఇది పెద్దవారి నుంచి చిన్న పిల్లల వరకు అందరికీ ఇదే రుగ్మతలా మారిపోయింది. మనకు తెలియకుండానే దానికి బానిస అవుతున్నాం. ఇది వ్యసనంగా మారి మనల్లే కాకుండా మన పిల్లలను సైతం నాశనం చేస్తోంది. మనం ఏం చేస్తామో మన పిల్లలు కూడా అదే రకంగా చేస్తారు.. కాబట్టి మనం నిత్యం ఫోన్ చూస్తూ ఉంటే వారూ కూడా అదే పని చేస్తున్నారు.
ఇది ఎలా అంటే వారు చిన్నప్పుడు అన్నం తినకపోతో జోలు పాటలు, ఉగ్గు పాటలు పాడటం మానేసి సెల్ఫోన్లో వీడియోలు చూపిస్తూ ఇప్పటి ఆధునికతరం అమ్మలు తినిపిస్తున్నారు. సెల్‌ఫోన్ చూస్తే కళ్ల సమస్యలు వస్తాయని తెలిసినా, నిపుణులు ఎన్ని చెప్పిన వారు మాత్రం లెక్కచేయడం లేదు. కాస్త ఏడిస్తే చాలు ఇది సెల్‌ఫోన్ అంటూ చేతికిచ్చేస్తున్నారు. వాడు ఏడకుండా అలా చూస్తూ ఎలా ఆడుకోవాలో కూడా మరిపోయే స్థితికి వచ్చాడు. మన సెల్‌ఫోన్ అలవాటు ఎంతలా ఉందంటే మూడు పూటల తినడానికి స్తోమత లేనివారు కూడా 90 శాతం సెల్‌ఫోన్ వినియోగిస్తుండగా.. వారిలో 60 మంది శాతం మంది స్మార్ట్‌ఫోన్‌ను వినియోగిస్తున్నారని స్వయంగా లెక్కలు చెబుతున్నాయి.
మొబైల్ ఫోన్ నుంచి విముక్తి ఎలా :
- ముందుగా అవసరానికి మాత్రమే సెల్‌ఫోన్ వాడేలా అలవాటు చేసుకుందాం.
- అది ఒక్కసారితో సాధ్యమయ్యే పని కాదు.
- అందుకే ఆదివారం సెలవు దినం కావున ఈరోజు నుంచే ప్రారంభిస్తే మంచిది.
- ఆదివారం మొబైల్‌ను ఉదయం నుంచి సాయంత్రం వరకు స్విచ్ఛాఫ్ చేసి సరదాగా కుటుంబంతో గడుపుదాం.
- ముఖ్యంగా మొబైల్‌ను చిన్న పిల్లలకు కనిపించకుండా దాచి పెడితే ఎంతో మంచిది.
- సెల్‌ఫోన్ గురించి మరిచిపోదాం.. అవసరముంటేనే వినియోగిద్దాం అనే నినాదంతో ముందుకు పోతే ఎంతో సాధిస్తాం.
సైబర్ నేరగాళ్లకు స్మార్ట్ ఫోన్‌తోనే చిక్కుతున్నాం : ప్రస్తుతం సాంకేతికం పెరగడంతో సెల్‌ఫోన్ జీవితంలో భాగమైపోయింది. ముఖ్యంగా అది విజ్ఞానాన్ని అందించే సాధనంగా మారిపోయింది. అవసరానికి ఉపయోగిస్తే బాగుంటుంది కానీ అస్తమానం ఉపయోగిస్తే మాత్రం ఇబ్బందులు, నష్టాలకు గురి కాకమానరు. సెల్‌ఫోన్ ఉంటే వాట్సాప్, ఇన్స్టాగ్రాం, ఫేస్బుక్, స్నాప్‌చాట్, గూగుల్, యూట్యూబ్ అంటూ సోషల్ మీడియా ఛానల్స్ చూస్తాం. ఇప్పుడు ఆ సామాజిక మాధ్యమాలే మోసాలు, ఆర్థిక సమస్యల్లో కూరుకుపోనిస్తున్నాయి. యూత్ ఆన్లైన్లో ఆటలు ఆడుతూ బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బులను ఖాళీ చేసి తల్లిదండ్రులకు క్షోభను కలిగిస్తున్నారు. విద్యావంతులైన వారు సైతం ఇలాంటి మోసాల బారిన తరుచూ పడుతున్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి సైబర్దాడులు అధికం అయిపోయాయి.
సెల్‌ఫోన్ వినియోగం తగ్గించాలంటే ఏం చేయాలి :
- సెల్‌ఫోన్ పక్కన పెట్టి టీవీ షోలు చూస్తూ కాలాన్ని గడిపేద్దాం.
- టీవీల్లో వచ్చే పాత సినిమా మొత్తం చూస్తూ నాటి రోజులు ఎలా ఉండేవో గుర్తు చేసుకుందాం.
- పుస్తకాలు చదవడం, కథల పుస్తకాలు, దినపత్రికలు చదవడం వంటివి చేద్దాం.
- ఆదివారం ప్రత్యేక సంచికలోని కథ, విశేష కథనం ఇలా ప్రతీది చదివేస్తే సెల్‌ఫోన్ అనేది ఒకటి ఉందనే విషయం తెలియదు.
- ఇంట్లో కూర్చుంటే బోర్ కొడుతుందంటే సినిమాకి వెళదాం. సినిమాను హాల్ చూస్తే ఆ కిక్కే వేరప్పా.
- ఇంట్లో వారితోగానీ, స్నేహితులతో గానీ క్యారంబోర్డు, క్రికెట్ వంటి ఆటలు ఆడేద్దాం.
- అమ్మానాన్నలకు ఇంటి పని చేస్తూ వారికి సాయం చేద్దాం.
సెల్‌ఫోన్ అధికంగా వాడుతున్న వారిలో ఈ సమస్యలట - ఓసారి చెక్ చేయండి - Cell Phone Usage Disadvantages