ETV Bharat / sports

కొత్త కోచ్ పేరు ప్రకటించిన నీరజ్ - ఆ లెజెండరీ అథ్లెట్ దగ్గర శిక్షణ

నీరజ్ చోప్రా కొత్త కోచ్ - ఆ లెజెండరీ అథ్లెట్ వద్ద ట్రైనింగ్

Neeraj Chopra New Coach
Neeraj Chopra (Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Nov 9, 2024, 4:08 PM IST

Neeraj Chopra New Coach : భారత స్టార్ జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా శనివారం తన కొత్త కోచ్‌ పేరును వెల్లడించారు. ప్రముఖ జావెలిన్ లెజెండ్ జాన్ జెలెజ్నీ వద్ద శిక్షణ తీసుకోనున్నట్లు తెలిపారు. తన కెరీర్‌లోని ఓ ఉత్తేజకరమైన కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇక జాన్ జెలెజ్నీ కెరీర్ విషయానికి వస్తే, 1992, 1996 , 2000 ఒలింపిక్ క్రీడల్లో పసిడి పతకాన్ని ముద్దాడిన ఈ స్టార్ అథ్లెట్​, ఆల్​టైమ్ టాప్ 10 బెస్ట్ త్రోలలో ఐదు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాకుండా నాలుగు సార్లు ప్రపంచ రికార్డును బ్రేక్​ చేసిన ఘనత కూడా ఈయన సొంతం. 1996లో జర్మనీ వేదికగా జరిగిన ఓ ఈవెంట్​లో 98.48 మీటర్లను బల్లెం విసిరి వరల్డ్​ రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు ఎవరూ దాన్ని బద్దలు కొట్టకపోవడం గమనార్హం.

ఇదిలా ఉండగా, టోక్యో 2020 ఒలింపిక్స్‌లో నీరజ్ గోల్డ్​ మెడల్ సాధించాడు. ఆ తర్వాత జాకుబ్ వాడ్లెజ్ రజత పతకాన్ని, విటెజ్‌స్లావ్ వెసెలీ కాంస్యాన్ని సొంతం చేసుకున్నారు. ఈ ఇద్దరికీ కోచ్​గా జాన్ జెలెజ్నీ వ్యవహరించారు. ఇక రెండుసార్లు ఒలింపిక్ ఛాంపియన్ , మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్​గా నిలిచిన బార్బోరా స్పాటకోవాకు కూడా జాన్ జెలెజ్నీ శిక్షణ ఇచ్చారు.

పాత కోచ్​కు నీరజ్​ ఎమోషనల్ ఫేర్​వెల్​
అయితే నీరజ్​ మాజీ కోచ్​ బార్టోనీజ్‌ కుటుంబ కారణాల వల్ల తన కోచింగ్ కెరీర్​కు ముగింపు పలికాడు. ఈ నేపథ్యంలో నీరజ్ ఎమోషనలయ్యాడు. సోషల్ మీడియాలో తన కోచ్​ కోసం ఓ స్పెషల్ వీడియో షేర్ చేశాడు. నాకు మీరు గురువు కన్నా ఎక్కువ. ఓ ఆటగాడిగా, వ్యక్తిగా ఎదగడానికి మీరు నాకు ఎంతో నేర్పించారు. అంటూ భావోద్వేగానికి గురయ్యాడు.

కాగా, జర్మనీకి చెందిన 75ఏళ్ల బార్టోనిట్జ్ గత ఐదేళ్లుగా నీరజ్​కు శిక్షణ ఇస్తున్నారు. తొలుత బయోమెకానిక్స్ నిపుణుడుగా వచ్చిన బార్టోనిట్జ్, ఆ తర్వాత కోచ్​గా నియామకమయ్యాడు. బార్టోనిట్జ్ ఆధ్వర్యంలోనే నీరజ్ తన కెరీర్​లో ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్ (2020) ​లో స్వర్ణం, అలాగే పారిస్ ఒలింపిక్స్​ (2024) లో సిల్వర్ మెడల్​ సాధించాడు.

'మీ చేతి చుర్మా తిన్నాక మా అమ్మ గుర్తొచ్చారు'- నీరజ్‌ తల్లికి ప్రధాని మోదీ లేఖ - Neeraj Chopra Mom Special Dish

కోహ్లీ, నీరజ్ చోప్రా - ఇప్పుడు భారత్‌లో మోస్ట్ పాపులర్ స్పోర్ట్స్ పర్సన్ ఎవరంటే? - Most Popular Sports Person In India

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.