ETV Bharat / entertainment

బన్నీకి రష్మిక స్పెషల్ గిఫ్ట్ - ఇస్తే లక్ ఖాయం! - RASHMIKA GIFT TO ALLU ARJUN

అల్లు అర్జున్​కు కో స్టార్ స్పెషల్ గిఫ్ట్ - ఇస్తే అదృష్టం వస్తుందట!

Rashmika Gift To Allu Arjun
Allu Arjun,Rashmika (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 10, 2024, 11:22 AM IST

Rashmika Gift To Allu Arjun : నేషనల్ క్రష్​ రష్మిక మంధన్నా తాజాగా తన కో స్టార్ అల్లు అర్జున్​కు ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి సర్​ఫ్రైజ్ చేశారు. ఈ విషయాన్ని బన్నీ తాజాగా తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త తెగ ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఆ ప్రత్యేకమైన కానుక ఏంటంటే?

అమ్మ చెప్పిన అదృష్టం - అందుకే ఆ గిఫ్ట్
ఇక రష్మిక బన్నీ కోసం ఓ వెండి గిఫ్ట్ పంపించారట. దాంతో పాటు స్వీట్స్ కూడా సెండ్ చేశారట. "వెండిని గిఫ్ట్​గా ఇస్తే దాన్ని అందుకున్న వ్యక్తికి అదృష్టం వరిస్తుందని మా అమ్మ చెప్పారు. ఈ వెండి వస్తువు, అలానే దీంతో పాటు పంపించిన స్వీట్స్‌ తప్పకుండా మీకు మరెంతో లక్‌ అలాగే పాజిటివిటీ, ప్రేమను అందిస్తాయని ఆశిస్తున్నాను" అని రష్మిక ఓ స్పెషల్ నోట్ షేర్ చేశారు. దానికి "థాంక్యూ మై డియర్‌. ఇప్పుడు నాకు మరెంతో అదృష్టం కావాలి" అంటూ అల్లు అర్జున్‌ రిప్లై ఇచ్చారు.

ఇక "బాక్సాఫీస్‌ వద్ద 'పుష్ప' తప్పకుండా రూల్‌ చేస్తుంది. మన కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది. ప్రేక్షకులు మన శ్రమను కచ్చితంగా గుర్తిస్తారు. ఈ విషయంలో నేను ఎంతో నమ్మకంగా ఉన్నాను" అని రష్మిక కూడా బన్నీకి రిప్లై ఇచ్చారు.

ఇక పుష్ప సినిమా విషయానికి వస్తే, ఎర్రచందనం స్మగ్లింగ్‌ బ్యాక్​డ్రాప్​లో డైరెక్టర్ సుకుమార్‌ ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన 'పుష్ప ది రైజ్‌' బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనికి సీక్వెల్​గా 'పుష్ప ది రూల్' రూపొందుతోంది. ఓ సాధారణ క కూలీగా ప్రయాణం ప్రారంభించి ఎర్రచందనం సిండికేట్‌ను శాసించే రేంజ్​కు ఎదిగిన పుష్ప గురించి పార్ట్‌ 1లో చూపించారు. పుష్ప రాజ్‌గా బన్నీ ఊరమాస్‌ యాక్షన్‌, అలాగే శ్రీవల్లి పాత్రలో రష్మిక నటన ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది.

ఇదిలా ఉండగా, ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ప్రమోషనల్ పోస్టర్స్ అభిమానులను తెగ ఆకట్టుకుని సినిమాపై భారీ అంచనాలు పెంచుతున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలోని ఓ స్పెషల్‌ సాంగ్‌ కోసం యంగ్ బ్యూటీ శ్రీలీలను ఎంపిక చేసినట్లు సమాచారం. పాన్ ఇండియా లెవెల్​లో ఈ సినిమా డిసెంబర్‌ 5న రిలీజ్‌ కానుంది.

పుష్ప 2కి ఒక్కరు కాదు ముగ్గురు- పెరుగుతున్న లిస్ట్​!

ఇది 'పుష్ప' రూలింగ్- రిలీజ్​కు ముందే మరో రికార్డ్ బ్రేక్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.