Increased Electricity Consumption In Telangana : రాష్ట్రంలో ఫిబ్రవరి ప్రారంభం నుంచే ఎండలు పెరిగిపోయాయి. రోజురోజుకూ భగ్గుమంటున్నాయి. పెరిగిన ఎండలతో విద్యుత్ వినియోగమూ క్రమంగా పెరుగుతోంది. ఈ నెల 7వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 15,804 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ నమోదైంది. గతేడాది మార్చిలో వచ్చిన డిమాండ్ ఈ ఏడాది ఇప్పుడే వచ్చేసింది. విద్యుత్ డిమాండ్ కొత్త రికార్డులు సృష్టిస్తోంది.
పెరిగిన విద్యుత్ డిమాండ్ : రాష్ట్రంలో విద్యుత్తు కనెక్షన్లు కూడా ఏటా లక్షల సంఖ్యలో పెరిగిపోతూనే ఉన్నాయి. వినియోగదారుల సంఖ్య కూడా అంతే మొత్తంలో పెరుగుతోంది. దీంతో ట్రిప్పింగ్ సమస్యలు కూడా పెరుగుతున్నాయి. వేసవి మొదలుకాగానే పలు ప్రాంతాలలో రోజూ ఒకటి రెండుసార్లు కరెంట్ పోతోందని ప్రజలు వాపోతున్నారు. నిరంతరం విద్యుత్ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వేసవి ఆరంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే ముందు ముందు ఇంకెలా ఉంటుంది..? మరి పెరిగిన విద్యుత్ వినియోగానికి అనుగుణంగా సరఫరా ఎలా? కోతలు లేకుండా విద్యుత్ సరఫరాకు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సమీకరణ ఎలా?