Sanju Samson Comments on Rohith about T20 World Cup 2024 Final : టీ 20 ప్రపంచ కప్ 2024 తుది పోరులో సౌతాఫ్రికాను ఓడించి టీమ్ ఇండియా ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. 11 ఏళ్ల తర్వాత టీమ్ ఇండియా ఐసీసీ ట్రోఫీ గెలవడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు. అయితే, కెరీర్లో మొదటి సారి ఈ వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకున్న వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే ఛాన్స్ దక్కలేదు. భారీ రోడ్డు ప్రమాదం తర్వాత రిషభ్ పంత్ తిరిగి నేషనల్ టీమ్‌లోకి రావడం వల్ల శాంసన్ బెంచ్‌కే పరిమితం అవ్వాల్సి వచ్చింది.
అయితే, దక్షిణాఫ్రికాతో తుదిపోరుకు ముందు బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉండాలని కెప్టెన్ రోహిత్ శర్మ తనతో చెప్పినట్లు శాంసన్ చెప్పాడు. కానీ, టాస్కు కొద్ది నిమిషాల ముందే జట్టులో మార్పులు చేయకుండా బరిలోకి దిగుతున్నట్లు రోహిత్ మళ్లీ తనతో చెప్పాడని శాంసన్ అన్నాడు.
"నాకు టీ 20 వరల్డ్ కప్ ఫైనల్లో ఆడే ఛాన్స్ దక్కింది. ఆడేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. నేను మ్యాచ్ కోసం సిద్ధమయ్యాను కూడా. అయితే, పాత జట్టుతోనే బరిలోకి దిగాలని టాస్ పడటానికి ముందు నిర్ణయించుకున్నారు. అయినా నాకేమీ ఈ విషయంలో బాధ లేదు. వార్మప్ చేస్తున్నప్పుడు రోహిత్ శర్మ నన్ను పక్కకు తీసుకెళ్లి మాట్లాడాడు. ఆ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాన్ని కూడా వివరించాడు. అర్థం చేసుకున్నావా? అని కూడా అడిగాడు. దానికి నేను ముందు మ్యాచ్ గెలుద్దాం. ఆ తర్వాత మాట్లాడుకుందాం. మ్యాచ్‌పై దృష్టి పెట్టండి" అని రోహిత్ శర్మతో చెప్పాను. మళ్లీ కాసేపటి తర్వాత రోహిత్ నా దగ్గరకు వచ్చి 'నువ్వు నన్ను మనసులో తిట్టుకుంటున్నావని తెలుసు. నువ్వు సంతోషంగా లేవని అనిపిస్తోంది' అని అన్నాడు. 'మా సంభాషణ పూర్తైన తర్వాత ఒక ప్లేయర్‌గా నేను ఆడాలనుకుంటున్నానని చెప్పాను' అని శాంసన్ చెప్పుకొచ్చాడు.