Sachin Ganguly Dravid Century In One Game : 1990వ దశకంలో భారత జట్టుపై విమర్శలు వచ్చేవి. విదేశాల్లో అంతగా రాణించకపోవడం వల్ల సిరీస్‌లను కోల్పోయేదంటూ అందరూ అనుకుంటుండేవారు. అయితే మాస్టర్ బ్లాస్టర్ సచిన్, 'ది వాల్'గా పిలుచుకునే రాహుల్ ద్రవిడ్, హిట్టర్ వీరేంద్ర సెహ్వాగ్, సౌరభ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ వచ్చిన తర్వాత భారత జట్టు రూపురేఖలే మారిపోయాయి.
'ఫ్యాబ్ ఫైవ్' అదుర్స్
అందుకే ఈ ఐదుగురిని 'ఫ్యాబ్ ఫైవ్'గా పిలిచేవారు. 2000లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల తర్వాత టీమ్‌ఇండియా కెప్టెన్‌గా సౌరభ్ గంగూలీ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి భారత జట్టు విదేశాల్లో విజయాలను ప్రారంభించింది. అయితే 2002లో జరిగిన సచిన్, గంగూలీ, ద్రవిడ్ ఒకే టెస్టు మ్యాచ్‌లో సెంచరీ చేశారు. ఆ మ్యాచ్‌లో ఎవరు గెలిచారంటే?
2002లో భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లింది. లార్డ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచులో సచిన్, గంగూలీ, ద్రవిడ్ త్రయం రాణించినా టీమ్‌ఇండియా ఓటమిపాలైంది. నాటింగ్ హోమ్ వేదికగా రెండో టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో ద్రవిడ్ సెంచరీ(115) చేయగా, సచిన్(92), గంగూలీ(99) త్రుటిలో సెంచరీని చేజార్చుకున్నారు.
ఒకే మ్యాచ్‌లో ముగ్గురు సెంచరీలు
అయితే లీడ్స్‌లో జరిగిన మూడో టెస్టులో ఆ కసిని తీర్చుకున్నారు గంగూలీ, సచిన్. రెండో మ్యాచులో చేజార్చుకున్న సెంచరీని చేశారు. ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 8 పరుగులకే ఔట్ అవ్వగా, ద్రవిడ్‌తో కలిసి సంజయ్ బంగార్ (68)తో రెండో వికెట్‌కు 170 పరుగులు భాగస్వామ్యాన్ని జోడించారు. ఆ తర్వాత సచిన్‌తో ద్రవిడ్ 150 పరుగుల పార్టనర్‌షిప్ చేశాడు. 148 పరుగుల వద్ద ద్రవిడ్ ఔట్ అయ్యాడు. అందులో 23 ఫోర్లు ఉన్నాయి.