Sa vs Afg T20 Semis 2024:2024 టీ20 వరల్డ్‌కప్‌లో అఫ్గానిస్థాన్ అద్భుత జర్నీ ముగిసింది. గురువారం సౌతాఫ్రికాతో జరిగిన తొలి సెమీఫైనల్లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలిసారి పొట్టికప్పు టోర్నీలో ఫైనల్‌కు చేరాలన్న అఫ్గాన్ కల చెదిరింది. దీంతో అఫ్గాన్ కెప్టెన్ రషీద్ ఖాన్‌తోపాటు జట్టు ప్లేయర్లంతా తీవ్ర నిరాశకు లోనయ్యారు. దీనిపై మ్యాచ్ అనంతరం రషీద్ ఎమోషనల్ ట్వీట్ చేశాడు.
'ఈ వరల్డ్‌కప్‌ను మేము ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. మా జట్టులో ప్రతి ఒక్కరు అద్భుతంగా పోరాడారు. వారి పట్ల నిజంగా గర్వంగా ఉంది. ఈ ఓటమి నుంచి నేర్చుకొని వచ్చే సీజన్లో గొప్పగా కమ్‌బ్యాక్ ఇస్తాం. టోర్నీలో మాకు మద్ధతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు' అని ట్వీట్లో రాసుకొచ్చాడు.
'ఇది మా రోజు కాదు. మేం ఇంతకంటే గొప్పగా ఆడగలం. కానీ, ఇవాళ పరిస్థితులు మాకు అనుకూలించలేదు. ఏది ఏమైనా ఈ వరల్డ్‌కప్‌ను మేం ఆస్వాదించాం. సెమీఫైనల్ వరకు రావడం సంతోషానిచ్చింది. కీలక పోరులో బలమైన ప్రత్యర్థితో ఓడిపోయామని ఒప్పుకుంటా. ఈ టోర్నీలో మా ప్రదర్శన అద్భుతం. మేం ఏ జట్టునైనా ఓడించగలం అన్న విశ్వసం వచ్చింది. వచ్చే ఎడిషన్‌లో మరింత దృఢమైన జట్టుగా ఎంట్రీ ఇస్తాం' అని రషీద్ మ్యాచ్ అనంతరం అన్నాడు.