Ruturaj Gaikwad Wife : ఓ వైపు చెన్నై సూపర్ కింగ్స్ సారథ్య బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు జట్టులోని ప్లేయర్‌గానూ సత్తా చాటుతున్నాడు యంగ్ క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్. ఈ సీజన్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అతడు, ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ మంచి స్కోర్ సాధిస్తూ జట్టుకు అండగా నిలిచాడు. ఇటీవలే కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగి అజేయ స్కోర్‌ను సాధించాడు రుతురాజ్. 58 బంతుల్లో 67 పరుగులు చేసి సత్తా చాటాడు. ఇలా సక్సెస్‌ఫుల్‌గా జట్టును లీడ్ చేస్తున్న ఈ స్టార్ క్రికెటర్ లాగే తన ఫ్యామిలీలో మరో క్రికెటర్ ఉన్నారు. ఆమె రుతురాజ్ సతీమణి ఉత్కర్ష పవార్.
పుణెలో జన్మించిన ఈమె 11 ఏళ్ల వయసు నుంచే క్రికెట్‌పై మక్కువ పెంచుకుంది. టీమ్ఇండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ బౌలింగ్ అంతే ఆమెకు ఎంతో ఇష్టమట. దీంతో ఆయనలా అవ్వాలని అనుకున్న ఉత్కర్ష, తండ్రిని ఒప్పించి కోచ్ అన్వర్ షేక్ వద్ద శిక్షణ తీసుకోవడం మొదలెట్టింది. అప్పటి నుంచి ఆమె పేస్ బౌలర్‌గా తనను తాను మెరుగుపరుచుకుంటూ రాణిస్తోంది. అయితే చిన్నప్పుడు ఆమెకు క్రికెట్‌తో పాటు కథక్ కూడా ఇష్టముందేదట. కానీ ఆమె అనూహ్యంగా క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఇక ఉత్కర్ష మహరాష్ట్ర మహిళా క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోంది. దేశవాళీలో ఆమె 10 మ్యాచ్‌లు ఆడి 5 వికెట్లు పడగొట్టింది. ప్రస్తుతం పుణెలోని న్యూట్రిషన్, ఫిట్‌నెస్ సైన్స్ ఇనిస్టిట్యూట్‌లో చదువుకుంటోంది. అయితే ఉన్నత చదువుల కోసం క్రికెట్‌కు విరామం తీసుకొంది. ఈ నేపథ్యంలో గత 18 నెలలుగా ఉత్కర్ష పవార్ క్రికెట్‌కు దూరంగా ఉంటోంది.