Rohit Sharma Warns Labuschagne :మెల్బోర్న్ టెస్టులో ఆసీస్‌కు శుభారంభం దక్కింది. ఈ టెస్టులో తొలి రోజు ముగిసేసరికి ఆసీస్ 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్ తొలి రోజు ఆసీస్ బ్యాటర్లపై టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అసహనం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ స్టార్ ప్లేయర్ లబుషేన్‌ను హెచ్చరించాడు.
ఇదీ జరిగింది
తొలి రోజు ఆటలో భాగంగా ఆసీస్ బ్యాటర్లు మార్నస్ లబుషేన్, కాన్‌స్టాస్ పిచ్ మధ్యలో పరుగులు తీశారు. అలా చేయడం వల్ల పిచ్ దెబ్బతింటుందని రోహిత్ వారిపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. పిచ్ మధ్యలోంచి పరిగెత్తకూడదంటూ లబుషేన్‌ను హెచ్చరించాడు. అతడితో మాట్లాడుతూ అసహనం వ్యక్తం చేశాడు. వెంటనే లబూషేను 'ఓకే ఓకే' అన్నట్లుగా బదులిచ్చాడు. అయితే ఈ సమయంలో ఫీల్డ్ అంపైర్ అక్కడే ఉన్నా లబుషేన్‌ను హెచ్చరించకపోవడం గమనార్హం.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. ఆసీస్ ప్లేయర్లు ఉద్దేశపూర్వరకంగానే పిచ్ మధ్యలో పరిగెత్తారంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. దీనిపై మ్యాచ్ రిఫరీలు చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.