ETV Bharat / sports

'నువ్వేం తప్పు చేశావు, నీకు ఈ డిమోషన్ ఏంటీ?'- రాహుల్​పై కవ్వింపు చర్యలు - IND VS AUS 4TH TEST

బాక్సింగ్ టెస్టులో కే ఎల్​ రాహుల్​కు డిమోషన్?- స్లెడ్జింగ్​కు పాల్పడ్డ ఆసీస్ ప్లేయర్​

Border Gavaskar Trophy
Border Gavaskar Trophy (Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : 16 hours ago

KL Rahul Border Gavaskar Trophy : బాక్సింగ్ డే టెస్టు తొలి ఇన్నింగ్స్​లో టీమ్ఇండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ 24 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఈ ఇన్నింగ్స్​లో 42 బంతులు ఎదుర్కొన్న రాహుల్ క్రీజులో కాస్త కుదురుకున్నట్లు కనిపించినా, కమిన్స్​ బౌలింగ్​లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే రాహుల్ బ్యాటింగ్​కు రాగానే ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ అతడి ఏకాగ్రత దెబ్బతీసే ప్రయత్నం షురూ చేశాడు. తన మాటలతో కవ్వింపు చర్యలకు పాల్పడ్డాడు.

'సిరీస్​లో ఓపెనర్​గా రాణిస్తున్నావ్ కదా. ఏం తప్పు చేశావు. నీకు ఈ డిమోషన్ ఏంటి? ఓపెనర్​వి వన్ డౌన్​లో బ్యాటింగ్​కు వచ్చావేంటి?' అంటూ రాహుల్​పై స్లెడ్డింగ్​కు పాల్పడ్డాడు. లియాన్ కామెంట్స్​ స్టంప్ మైక్​లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్​ అయ్యాయి. గతంలోనూ భారత బ్యాటర్లను ఆసీస్ ప్లేయర్లు స్లెడ్జింగ్ సందర్భాలు చాలానే ఉన్నాయి.

రాణించిన రాహుల్
బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో కేఎల్ రాహుల్ మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. పెర్త్‌ టెస్ట్​లో రెండో ఇన్నింగ్స్​లో ఆకట్టుకున్న రాహుల్, తర్వాత మ్యాచ్​ల్లోనూ రాణించాడు. గబ్బా టెస్టు డ్రా గా ముగియడంలోనూ రాహుల్ పాత్ర ఉంది. అయితే గత రెండు మ్యాచ్​ల్లో మిడిల్ ఆర్డర్​లో బ్యాటింగ్​కు దిగిన కెప్టెన్ రోహిత్ శర్మ ఘోరంగా విఫలయ్యాడు.

దీంతో బాక్సింగ్ డే టెస్టులో యశస్వితో కలిసి రోహిత్ శర్మ ఓపెనర్​గా బరిలోకి దిగాడు. అందువల్లే రాహుల్ వన్​ డౌన్​లో రావాల్సి వచ్చింది. ఇదే విషయం గురించి ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ కామెంట్స్ చేశాడు. ఓపెనర్​ నుంచి మూడో స్థానం​లో బ్యాటింగ్ చేయడానికి నువ్వు ఏమి తప్పు చేశావని లియాన్ స్లెడ్జింగ్​కు పాల్పడ్డాడు.

కష్టాల్లో టీమ్ఇండియా
ఈ టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమ్ ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. క్రీజులో రిషభ్‌ పంత్ (6), రవీంద్ర జడేజా (4) ఉన్నారు. భారత్ ఫాలో ఆన్ గండం నుంచి తప్పించుకోవాలంటే మరో 111 పరుగులు చేయాలి. అంతకుముందు తొలి ఇన్నింగ్స్​లో ఆసీస్‌ 474 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.

విరాట్​పై ఆసీస్ మీడియా ట్రోలింగ్- రవిశాస్త్రి స్ట్రాంగ్ కౌంటర్

ఆసీస్ బ్యాటర్​పై రోహిత్ ఫైర్- చెబితే వినాలిగా మరి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.