Ind vs Ban 2nd Test 2024 :బంగ్లాదేశ్‌పై తొలి టెస్టు విజయంతో జోష్ మీదున్న టీమ్ఇండియా, కాన్పూర్ వేదికగా జరగబోయే రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో ముమ్మురంగా టీమ్ఇండియా ఆటగాళ్లు నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే ఈ టెస్టులో భారత ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్‌ను ఊరిస్తున్న రికార్డులేంటో ఓ సారి తెలుసుకుందాం.
రోహిత్ శర్మ
బంగ్లాదేశ్‌తో కాన్పూర్ వేదికగా జరగబోయే టెస్టులో భారత జట్టు కెప్టెన్ రోహిత్ మూడు రికార్డులు ఊరిస్తున్నాయి. రోహిత్ ఈ టెస్టులో 8 సిక్సర్లు బాదితే, టీమ్ఇండియా తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా నిలుస్తాడు. ప్రస్తుతానికి వీరేంద్ర సెహ్వాగ్ (91) టీమ్ఇండియా తరఫున టెస్టు ఫార్మాట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్‌గా ఉన్నాడు.
అలాగే రోహిత్ ఈ టెస్టులో మరో 7 పరుగులు చేస్తే, టీమ్ఇండియా హెచ్ కోచ్ గౌతమ్ గంభీర్ (4,154) ను దాటేస్తాడు. ప్రస్తుతం రోహిత్ టెస్టుల్లో 4,148 రన్స్ చేశాడు. టెస్టుల్లో ఇప్పటికే 12 సెంచరీలు చేసిన రోహిత్, ఇంకొక శతకం బాదేస్తే మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంటాడు. టీమ్ఇండియా ప్లేయర్స్ రహానే, మురళీ విజయ్, పాలి ఉమ్రిగర్ను శతకాల్లో దాటేస్తాడు.
అశ్విన్ రికార్డులు
టీమ్ఇండియా ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్‌ను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. కాన్పూర్ వేదికగా బంగ్లాతో జరిగే రెండో టెస్టు నాలుగో ఇన్నింగ్స్‌లో అశ్విన్ మరో వికెట్ తీస్తే అరుదైన ఫీట్‌ను అందుకుంటాడు. టెస్టు నాలుగో ఇన్నింగ్స్‌లో 100 వికెట్లు తొలి భారతీయుడిగా నిలుస్తాడు.
మరో 3 వికెట్ల దూరంలో :బంగ్లాదేశ్‌పై టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా అవతరించడానికి అశ్విన్ మరో మూడు వికెట్లు తీయాలి. టీమ్ఇండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ 31 వికెట్లు తీసి అగ్రస్థానంలో ఉన్నాడు. అశ్విన్ 29 వికెట్లు పడగొట్టాడు.
ప్రపంచ వరల్డ్ ఛాంపియన్షిప్ 2023- 2025 సీజన్లో ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజిల్ వుడ్ 51 వికెట్లు పడగొట్టి అగ్రస్థానంలో నిలిచాడు. కాన్పూర్ లో జరిగే రెండో టెస్టులో అశ్విన్(48) మరో నాలుగు వికెట్లు తీస్తే తొలిస్థానాన్ని దక్కించుకుంటాడు. టెస్టుల్లో అత్యధిక సార్లు 5 వికెట్లు పడగొట్టిన ఘనత ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం షేన్ వార్న్(37) పేరిట ఉంది. కాన్పూర్ టెస్టులో అశ్విన్ మరోసారి 5 వికెట్లు తీస్తే షేన్ వార్న్ రికార్డును సమం చేస్తాడు. బంగ్లాదేశ్‌తో జరగబోయే రెండో టెస్టులో అశ్విన్ మరో 8 వికెట్లు సాధిస్తే, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలుస్తాడు.