Rohit Sharma Thank You Post : న్యూ ఇయర్ సందర్భంగా టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ వీడియోను షేర్ చేశాడు. "ఎన్నో ఎత్తు పల్లాలను చవిచూశాం. ప్రతి ఒక్కదానితో మేము అనుభవం సాధించాం. అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాం. థ్యాంక్యూ 2024" అంటూ ఓ స్పెషల్ క్యాప్షన్ జోడించాడు. ఇక ఆ వీడియోలో భారత్ టీ20 ప్రపంచకప్ నెగ్గడం, రెండోసారి తండ్రి కావడం, జన్మదిన వేడుకలు, షూటింగ్స్‌కు సంబంధించిన మూమెంట్స్‌ను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
అయితే రోహిత్ ఇలా ఎమోషనల్‌గా పోస్ట్ చేయడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. తను రిటైర్మెంట్ ఏమైనా ప్రకటించే ఆలోచనలో ఉన్నాడా అని అనుకుంటున్నారు. ప్లీజ్ అలా చేయొద్దు అంటూ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.
సిడ్నీలో విరాట్ చక్కర్లు!
ఇదిలా ఉండగా, టీమ్‌ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ న్యూ ఇయర్ సందర్భంగా తన భార్య అనుష్క శర్మతో కలిసి సిడ్నీ వీధుల్లో విహరించారు. ఆ సమయంలో పలువురు అభిమానుల కెమెరా కంటికి చిక్కారు ఈ జంట. ప్రస్తుతం ఈ వీడియో కూడా నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.