Rohit Sharma Saves Sarfaraz Khan:టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ సలహా వల్ల యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌కు ప్రమాదం తప్పింది. ధర్మశాల టెస్టు మూడో రోజు ఇంగ్లాండ్ బ్యాటర్ షోయబ్ బషీర్ బ్యాటింగ్ చేస్తుండగా, సర్ఫరాజ్ షార్ట్ లెగ్ (Short Leg)లో ఫీల్డింగ్ చేస్తున్నాడు. కుల్దీప్ యాదవ్ వేసిన బంతిని బషీర్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. బ్యాట్‌ను తాకిన బంతి వేగంగా వచ్చి షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సర్ఫరాజ్ తలకు తగిలింది. అయితే ఆ సమయంలో సర్ఫరాజ్ హెల్మెట్ ధరించి ఉండడం వల్ల పెను ప్రమాదం తప్పింది.
ఇది చూసిన నెటిజన్లు రోహిత్ సలహా కారణంగానే సర్ఫరాజ్‌కు ప్రమాదం తప్పిందని అభిప్రాయపడుతున్నారు. అయితే భారత్- ఇంగ్లాండ్ నాలుగో టెస్టులో సర్ఫరాజ్ హెల్మెట్ లేకుండా సిల్లీ పాయింట్(Silly Point)లో ఫీల్డింగ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. అది గమనించిన రోహిత్ వెంటనే 'ఓయ్, హీరో నహీ బన్నే, హెల్మెట్ పేన్' (హీరో అవ్వడం అవసరం లేదు. హెల్మెట్ పెట్టుకో) అని అన్నాడు. వెంటనే సర్ఫరాజ్ ఆ మ్యాచ్‌లో కూడా హెల్మెట్ పెట్టుకున్నాడు. ఈ మాటలు అక్కడే ఉన్న స్టంప్స్ మైక్రోఫోన్లో రికార్డయ్యాయి. దీంతో ఆటలో సాహసాలు చేయడం మానేసి ముందు సేఫ్టీ చూసుకోవాలని రోహిత్ సూచించడం తన కెప్టెన్సీ లక్షణాల్లో ఒకటని నెటిజన్లు అప్పడు ప్రశంసించారు. ఇక తాజా సంఘటనతో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. హీరో అయ్యే అవసరం లేదని రోహిత్ భాయ్ అప్పుడే చెప్పాడని కామెంట్ సెక్షన్లో గుర్తుచేస్తున్నారు.