Rohit Sharma Aggressive Batting:భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్, అమెరికా- వెస్టిండీస్ వేదికగా జరిగిన టీ 20 ప్రపంచకప్, ప్రస్తుతం జరుగుతున్న శ్రీలంక సిరీస్ మూడింట్లో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ విధానం హిట్టింగే. ఏ మ్యాచ్ అయినా తొలి బంతి నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడడం, వారిని ఒత్తిడిలోకి నెట్టి భారత్‌కు పటిష్టమైన పునాదిని నిర్మించడంమే రోహిత్ టార్గెట్. గత కొన్ని రోజులుగా రోహిత్ ఇదే విధంగా ఆడుతున్నాడు. ఇలా దూకుడుగా ఆడే క్రమంలో ఒక్కోసారి రోహిత్ షాట్ సెలక్షన్‌ను పలువురు తప్పుబట్టారు.
అతడి షాట్ సెలక్షన్‌పై విమర్శలు కూడా వచ్చాయి. అయితే దీనిపై హిట్‌మ్యాన్ తాజాగా శ్రీలంక పర్యటనలో స్పందించాడు. తాను రిస్క్ తీసుకోవడానికి ఎప్పుడూ భయపడనని తేల్చి చెప్పేశాడు. దూకుడుగా ఆడే క్రమంలో తాను రిస్క్ తీసుకుంటూనే ఉంటానని స్పష్టం చేశాడు. దూకుడుగా ఆడి సెంచరీ బాదినా, హాఫ్ సెంచరీ చేసినా సున్నాకే (0) ఔటైనా తన విధానం మాత్రం మారబోదని కుండబద్దలు కొట్టాడు.
ఇంతకీ రోహిత్ ఏమన్నాడంటే?
శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో హిట్‌మ్యాన్ కేవలం 44 బంతుల్లోనే 64 పరుగులుతో రాణించాడు. రోహిత్ దూకుడుతో భారత జట్టు కూడా ఓ దశలో పటిష్టంగా కనిపించిది. అయితే వాండర్సే బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ ఆడిన రోహిత్, పాతుమ్ నిస్సాంకకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రోహిత్ ఇలా ఔవుటైన తర్వాత విమర్శలు వచ్చాయి. చెత్త షాట్ ఆడి రోహిత్ వికెట్ సమర్పించుకున్నాడని కొందరు విమర్శించారు. దీనిపై రోహిత్ శర్మ స్పందించాడు.