తెలంగాణ

telangana

ETV Bharat / sports

CEATతో రోహిత్‌ బ్యాట్ స్పాన్సర్‌షిప్ ఒప్పందం - హిట్‌మ్యాన్‌కి ఆ కంపెనీ ఎంత చెల్లిస్తుందంటే? - ROHIT SHARMA CEAT SPONSORSHIP - ROHIT SHARMA CEAT SPONSORSHIP

Rohit Sharma CEAT Sponsorship : క్రికెటర్లు వివిధ కంపెనీలతో బ్యాట్‌ స్పాన్సర్‌షిప్‌ అగ్రిమెంట్‌లు చేసుకుంటుంటారని తెలిసిందే. అయితే రోహిత్‌ శర్మ సియట్‌ ఎంత చెల్లిస్తుందంటే ?.

Rohit Sharma CEAT Sponsorship
Rohit Sharma (Associated Press)

By ETV Bharat Sports Team

Published : Aug 22, 2024, 7:37 PM IST

Rohit Sharma CEAT Sponsorship :క్రికెట్‌ ప్లేయర్స్‌ బ్యాట్‌లపై వివిధ కంపెనీల లోగోలతో స్టిక్కర్లు చూసే ఉంటారు. దాదాపు అందరు ప్లేయర్లు ఆయా కంపెనీలతో బ్యాట్‌ స్పాన్సర్‌షిప్‌ ఒప్పందాలు చేసుకొని ఉంటారు. టీమ్‌ ఇండియా కెప్టెన్‌, స్టార్‌ బ్యాటర్‌ రోహిత్‌ శర్మ టైర్ బ్రాండ్ సియట్‌తో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. చాలా ఏళ్ల క్రితమే ఈ అసోసియేషన్‌ మొదలైంది. అయితే ఇప్పుడు ఈ పార్ట్‌నర్‌షిప్‌ గురించి అభిమానులు, విశ్లేషకులు ఎక్కువగా మాట్లాడుతున్నారు. ప్రధానంగా ఆర్థిక అంశాల గురించి చర్చిస్తున్నారు. ఇంతకీ రోహిత్ శర్మకు సియట్‌ ఎంత చెల్లిస్తుంది? ఇప్పుడు తెలుసుకుందాం.

ఎప్పుడు డీల్‌ కుదిరింది?
2015లో సియట్‌తో మూడు సంవత్సరాల ఒప్పందంపై రోహిత్ శర్మ సంతకం చేశాడు. ఆ సమయంలో తన అత్యుత్తమ ప్రదర్శనల కారణంగా రోహిత్‌కి ఈ అవకాశం వచ్చింది. 2018 నాటికి డీల్ మరో మూడేళ్ల పాటు పొడిగించారు. రోహిత్‌ సక్సెస్‌, పాపులారిటీ మరింత పెరుగుతుందని సియట్‌ కంపెనీ విశ్వసించింది.

ఆర్థిక వివరాలు
2024 నాటికి సియట్‌తో స్పాన్సర్‌షిప్ డీల్‌ ద్వారా రోహిత్‌ ఏడాదికి సుమారు రూ.4 కోట్లు సంపాదిస్తున్నట్లు తెలిసింది. దీంతో బ్యాట్ ఎండార్స్‌మెంట్‌ల పరంగా అత్యధికంగా సంపాదించేవారిలో ఒకడిగా రోహిత్‌ నిలిచాడు. హిట్‌మ్యాన్‌ కంటే విరాట్ కోహ్లీ ఎక్కువ సంపాదిస్తున్నాడని గమనించాలి.

డీల్ జరిగిన మొదటి మూడు సంవత్సరాలను పరిశీలిస్తే, రోహిత్ దాదాపు రూ.12 కోట్లు సంపాదించాడు. మూడేళ్ల పొడిగింపుతో ఆరేళ్లలో మొత్తం రూ.24 కోట్లు అందుకొని ఉండవచ్చు. స్పష్టమైన వివరాలు అందుబాటులో లేనప్పటికీ, సెంచరీలు చేయడం, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడం వంటి సందర్భాల్లో బోనస్‌లు కూడా అందుకోవచ్చు. అంటే రోహిత్ తన ప్రదర్శనతో సియట్‌ నుంచి మరింత ఆదాయం అందుకునే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాల మాట.

రోహిత్ శర్మను ఎందుకు ఎంచుకుంది?
రోహిత్ శర్మ కన్సిస్టెన్సీ, ప్లేయింగ్‌ స్టైల్‌ సియట్‌ బ్రాండ్ ఇమేజ్‌కి సూట్‌ అవుతుంది. వన్డే ఇంటర్నేషనల్స్ (ODIs)లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన మొదటి ఆటగాడిగా చరిత్ర సృష్టించిన రోహిత్‌, బ్రాండ్‌కు మరింత విజిబిలిటీని తీసుకొచ్చాడని తెలుస్తోంది.

అలానే రోహిత్ పాపులారిటీ క్రికెట్ అభిమానులకే పరిమితం కాలేదు. అతడు భారతదేశం, ఇతర దేశాల్లోనే క్రేజ్‌ సొంతం చేసుకున్నాడు. క్రికెట్‌ని ఎక్కువగా ఫాలో అవ్వని వారు కూడా స్పోర్ట్స్‌ ఐకాన్‌గా రోహిత్‌ని గుర్తిస్తారు. దీంతో సియట్‌ కంపెనీకి హిట్‌మ్యాన్‌, గ్రేట్‌ అంబాసిడర్‌గా మారాడు.

క్రికెటర్ ఆఫ్ ది ఇయర్​గా రోహిత్- CEAT అవార్డ్స్​లో కెప్టెన్ ఘనత - Rohit Sharma 2024

టీ20ల్లో వీరి దూకుడు మామూలుగా ఉండదు! రోహిత్​ కన్నా ఎక్కువ సిక్సర్లు కొట్టిందెవరంటే? - Cricketers WithMoreSixes Than Rohit

ABOUT THE AUTHOR

...view details