తెలంగాణ

telangana

ETV Bharat / sports

డ్రైవింగ్ సీట్​లో రోహిత్ శర్మ- ఎంటర్​టైన్​మెంట్​లో హిట్​మ్యాన్ 'తగ్గేదేలే'- వీడియో వైరల్ - Rohit Sharma Bus Driving

Rohit Sharma Bus Driving: ముంబయి ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ టీమ్ బస్ నడిపేందుకు ప్రయత్నించిన వీడియో వైరలైంది. మరి మీరు ఆ వీడియో చూశారా?

Rohit Sharma Bus Driving
Rohit Sharma Bus Driving

By ETV Bharat Telugu Team

Published : Apr 13, 2024, 8:14 PM IST

Updated : Apr 13, 2024, 8:48 PM IST

Rohit Sharma Bus Driving:ముంబయి ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఫ్యాన్స్​ను ఎంటర్​టైన్ చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటాడు. ఈ క్రమంలోనే గ్రౌండ్​లో తన ఆటతోపాటు అల్లరి పనులు, ఫన్నీ మాటలతో క్రికెట్ ఫ్యాన్స్​ను అలరిస్తూ, మీమ్స్​ క్రియేటర్స్​కు మంచి స్టఫ్ ఇస్తుంటాడు. ఇక తాజాగా ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ బస్ (Mumbai Indians Team Bus)ను నడిపేందుకు ప్రయత్నించి మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్​గా మారాడు.

ముంబయిలో ప్రాక్టీస్ సెషన్ పూర్తి చేసుకున్న ప్లేయర్లు టీమ్​ బస్​లో హోటల్​కు చేరుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో ముంబయి ప్లేయర్లు, సిబ్బంది అంతా బస్ ఎక్కి తమతమ సీట్ల వద్దకు వెళ్లగా, మాజీ కెప్టెన్ రోహిత్ మాత్రం బస్​ డ్రైవింగ్ సీట్​లో కూర్చున్నాడు. వెంటనే 'బస్ నడుపుతున్నా అందరూ పక్కకు జరగండి అంటూ' ఫ్యాన్స్​కు సిగ్నల్ ఇచ్చాడు. స్టీరింగ్​పై చేతులేసి బస్​ స్టార్ట్​ చేయడానికి ట్రై చేశాడు. ఇక బస్​లో ఉన్న ముంబయి ప్లేయర్లు డ్రైవింగ్ సీట్​లో కూర్చున్న రోహిత్​ను ఫొటోలు తీశారు. ఇక అక్కడే ఉన్న ఫ్యాన్స్​ రోహిత్​ను చూసి కేరింతలు కొట్టారు. దీంతో ఆ ప్రాంతం కాసేపు సందడిగా మారింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. ఇది చూసిన ఫ్యాన్స్, 'హిట్​మ్యాన్ గ్రౌండ్​లోనే కాదు, బయట కూడా జట్టను ముందుండి నడుపుతున్నాడు' అంటూ కామెంట్ చేస్తున్నారు.

Rohit Sharma IPL 2024: ప్రస్తుత ఐపీఎల్​లో రోహిత్ శర్మ అదరగొడుతున్నాడు. రాజస్థాన్​ రాయల్స్​తో మ్యాచ్​లో మినహా అన్నింట్లోనూ రాణించాడు. ఇందులో రెండు సార్లు 40+ స్కోర్లు సాధించాడు. ఇప్పటివరకూ 5 మ్యాచ్​లు ఆడిన రోహిత్ 167.74 స్ట్రైక్​ రేట్​తో 156 పరుగులు చేశాడు. ఇందులో 17ఫోర్లు, 10 సిక్స్​లు ఉన్నాయి. అంటే బౌండరీల ద్వారానే రోహిత్ 128 పరుగులు సాధించాడు.

MI vs CSK IPL 2024: ఇక ముంబయి ఇండియన్స్ ఆదివారం వాంఖడే వేదికగా చెన్నై సూపర్​ కింగ్స్​ను ఢీ కొట్టనుంది. దాదాపు 11ఏళ్ల తర్వాత ధోనీ, రోహిత్ కెప్టెన్​గా లేకుండా చెన్నై- ముంబయి తొలిసారి తలపడుతున్నాయి. ఇక ఇరు జట్లు కూడా తమతమ చివరి మ్యాచ్​ల్లో విజయం సాధించి జోరుమీదున్నాయి.

ఆ రెండూ నా టార్గెట్!- అప్పటిదాకా నో రిటైర్మెంట్!- ​రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ - Rohit Sharma Retirement

'వరల్డ్ కప్​ కోసమే కదా ఇదంతా' - దినేశ్​ను టీజ్​ చేసిన రోహిత్ శర్మ! - IPL 2024 MI VS RCB

Last Updated : Apr 13, 2024, 8:48 PM IST

ABOUT THE AUTHOR

...view details