తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీమ్ఇండియా ఫోకస్ అంతా దానిపైనే! మరి రోహిత్​ పొజిషన్ ఎక్కడంటే?

బ్యాటింగ్ ఆర్డర్​లో కన్​ఫ్యూజన్​ - ఈ సారి తుది జట్టులో రోహిత్ పొజిషన్ ఎక్కడంటే?

Rohit Sharma Border Gavaskar Trophy
Rohit Sharma (Associated Press)

By ETV Bharat Sports Team

Published : 9 hours ago

Rohit Sharma Border Gavaskar Trophy : టీమ్‌ఇండియా స్టార్ క్రికెటర్ రోహిత్‌ శర్మ రానున్న మ్యాచ్​లో ఏ స్థానంలో బ్యాటింగ్​కు దిగుతాడన్న విషయంలో సందిగ్ధత నెలకొంది. ఇటీవలె ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో రోహిత్‌ గైర్హాజరీ కాగా, అతడి బదులు కేఎల్‌ రాహుల్‌ ఓపెనర్​గా దిగాడు. యశస్వి జైస్వాల్‌తో కలిసి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ క్రమంలో అతడినే ఓపెనర్‌గా కొనసాగించాలన్న డిమాండ్ల కూడా బాగానే వచ్చాయి.

అందుకే అడిలైడ్‌లో డే నైట్‌ టెస్టులో రోహిత్‌ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. కానీ ఆ ఇన్నింగ్స్​లో రాహుల్‌, రోహిత్‌ ఇద్దరూ విఫలమయ్యారు. నితీశ్‌ తప్ప జట్టులోని బ్యాటర్లందరూ నిరాశపరిచారు. ఈ క్రమంలో గత 6 ఏళ్లుగా ఓపెనర్‌గా విజయవంతమైన రోహిత్‌ బ్యాటింగ్‌ స్థానాన్ని మార్చడం సరికాదంటూ క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్, రవిశాస్త్రి సహా చాలామంది మాజీలు టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌ నిర్ణయాన్ని తప్పుపట్టారు.

మరి మూడో టెస్టులో రోహిత్‌ ఓపెనర్‌గా వస్తాడా అంటే అటువంటి ఉద్దేశమేమి లేన్నట్లే తెలుస్తోంది. బ్రిస్బేన్‌లో 14న మొదలు కానున్న మూడో టెస్టు కోసం ఇప్పటికే టీమ్ఇండియా తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే నెట్స్‌లో తొలుత యశస్వి, రాహుల్‌ ఆ తర్వాతనే కోహ్లి, రోహిత్‌ బ్యాటింగ్‌కు దిగారు. ముఖ్యంగా డిఫెన్స్‌ టెక్నిక్‌పై బ్యాటర్లందరూ ఫోకస్ పెట్టారు. ఆఫ్‌స్టంప్‌ ఆవల బంతులను ఆడకుండా వదిలేయడాన్ని కూడా ప్రాక్టీస్​ చేశారు. "బ్రిస్బేన్‌ టెస్టుకు అడిలైడ్‌లో సన్నాహాలు మొదలయ్యాయి" అంటూ సోషల్ వేదికగా టీమ్‌ఇండియా సాధన వీడియోను బీసీసీఐ పంచుకుంది.

గత 12 ఇన్నింగ్సలలో 142 పరుగులు మాత్రమే స్కోర్ చేసిన రోహిత్‌ లయను దొరకబుచ్చుకునేందుకు నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాడు. భారత స్పిన్నర్లు, పేసర్ల బౌలింగ్‌లో సాధన చేశాడు. తొలి టెస్టులో సెంచరీతో అలరించిన విరాట్‌ కోహ్లి, రెండో మ్యాచ్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్‌లలోనూ వికెట్ల వెనుక క్యాచ్‌లు అందించిన కోహ్లి ఆఫ్‌స్టంప్‌ ఆవల బంతులను ఆడే విషయంలో బలహీనతను అధిగమించే ప్రయత్నం చేశాడు.

ఇక కేఎల్‌ రాహుల్‌ డిఫెన్స్‌పై ఫుల్ ఫోకస్ పెట్టగా, రిషబ్‌ పంత్‌ మాత్రం కొన్ని షాట్లు ఆడాడు. యశస్వి జైశ్వాల్‌ నెట్స్‌లోనూ దూకుడుగా బ్యాటింగ్‌ చేశాడు. పేసర్లు హర్షిత్‌ రానా, ఆకాశ్‌ దీప్, రవిచంద్రన్‌ అశ్విన్, యశ్‌ దయాల్‌ స్పిన్నర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌ కూడా ఈ ప్రాక్టీస్‌లో యాక్టివ్​గా పార్టిసిపేట్ చేశారు.

టోర్నీ గెలుస్తానని రోహిత్ మాటిచ్చాడు- అదే నా గురుదక్షిణ!: కోచ్

'ఆ స్ఫూర్తి ఎటు పోయింది- రోహిత్, విరాట్ ఇది మీరేనా?'

ABOUT THE AUTHOR

...view details