ETV Bharat / sports

ఆ భయం మమ్మల్ని వెంటాడుతోంది - ఇక ఛాంపియన్స్ ట్రోఫీ జరగడం కష్టమే : పాక్ మాజీ కెప్టెన్

ఛాంపియన్స్​ ట్రోఫీ విషయంలో పాక్ మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్ - 'ఛాంపియన్స్ ట్రోఫీ జరిగే అవకాశాలు దాదాపుగా లేనట్లే!'

ICC Champions Trophy 2025
ICC Champions Trophy 2025 (Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : 6 hours ago

ICC Champions Trophy 2025 : వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్‌ ట్రోఫీ షెడ్యూల్‌ విడుదల కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న వేళ పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీ జరిగే అవకాశాలు దాదాపు కష్టమేనని పేర్కొన్నాడు.

"ఛాంపియన్స్ ట్రోఫీ జరిగే అవకాశాలు దాదాపుగా లేనట్లే అని అనిపిస్తోంది. నేను కూడా అసలు జరగకూడదనే కోరుకుంటున్నాను. వారు (ఐసీసీ) రిజెక్ట్ చేసే ముందే మీరు (పీసీబీ) వద్దని చెప్పాల్సింది. పీసీబీ, ఏసీబీ, ఐసీసీ ఏదైనా సరే బీసీసీఐతో అస్సలు పోరాడలేవు. ఎందుకంటే భారత్‌ బాయ్‌కాట్‌ చేస్తుందేమోననే భయం మమ్మల్ని వెంటాడుతోంది. అప్పుడు మనం ఏం చేయాలి? మన స్టాండ్‌ ఎలా ఉండాలి? ఐసీసీ లేదా ఏసీబీ కలిసి వస్తాయా? అనేది మనం ఆలోచించుకోవాలి" అని లతీఫ్‌ వ్యాఖ్యానించాడు.

వచ్చే ఏడాది పాక్‌ ఆతిథ్యంలో ట్రోఫీ జరగాల్సి ఉంది. అయితే పీసీబీ, బీసీసీఐ మధ్య సయోధ్య కుదరడం లేదని క్రిటిక్స్ వాదన. ఈ క్రమంలోనే ఇప్పడు హైబ్రిడ్‌ మోడల్‌కు అంగీకరించాలంటూ ఐసీసీ కూడా పీసీబీకి ఆఫర్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ రీసెంట్​గా జరగాల్సిన ఐసీసీ సమావేశం మాత్రం వాయిదా పడుతూనే వస్తోంది. అయితే ఈ విషయంపై తుది నిర్ణయాన్ని బుధవారం ఖరారు చేస్తారని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

నిర్ణయం వచ్చేనా?
ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహణపై మరికొద్ది గంటల్లో నిర్ణయం వెలువడే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ వర్గాల మాట. ఈ నేపథ్యంలో పాక్​ కూడా ఈ హైబ్రిడ్‌ మోడల్‌కు ఓకే చెప్తుందనే అంతా అనుకుంటున్నారు. కానీ ఫ్యూచర్​లో తమ మ్యాచ్‌లకూ ఇదే మోడల్‌ను అనుసరించాలని ఇప్పటికే పాక్‌ బోర్డు ఐసీసీ దృష్టికి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

"ఐసీసీ నుంచి పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు ఓ లిఖితపూర్వకమైన హామీని కోరుతోంది. అదేంటంటే భారత్ ఆతిథ్యం ఇచ్చే టోర్నీల్లో తాము మ్యాచ్‌ ఆడే వేదికలను హైబ్రిడ్‌ పద్ధతిలోనే ఏర్పాటు చేయాలనేది వారి (పీసీబీ) కండీషన్. దీనిపై బుధవారం జరగనున్న సమావేశంలో చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంటుంది" అని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఛాంపియన్స్ ట్రోఫీ - పాక్ మళ్లీ అదే తంతు - ఐసీసీ సమావేశం వాయిదా!

'నేనైతే కరెక్ట్​గానే ఉన్నా - జైషా అలా చేస్తారని అశిస్తున్నా!' - పీసీబీ చీఫ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.