ETV Bharat / state

లా అండ్​ ఆర్డర్​కు విఘాతం కలిగించరాదు - మంచు విష్ణుకు సూచించిన రాచకొండ సీపీ - ATTACK CASE OF MANCHU MANOJ

రాచకొండ సీపీ ఎదుట ముగిసిన మంచు విష్ణు విచారణ - శాంతిభద్రతలకు విఘాతం కలిగించరాదని విష్ణుకు చెప్పిన సీపీ సుధీర్‌బాబు- కోర్టు ఉత్తర్వుల ప్రకారం తదుపరి చర్యలు ఉంటాయన్న సీపీ

Manchu Vishnu Main Follower Arrest
Manchu Vishnu Main Follower Arrest (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 11, 2024, 6:10 PM IST

Updated : Dec 11, 2024, 10:25 PM IST

Manchu Vishnu AT Rachakonda Commissionerate : రాచకొండ కమిషనరేట్‌లో సీపీ ఎదుట మంచు విష్ణు విచారణ ముగిసింది. మరోసారి శాంతిభద్రతలు విఘాతం కలిగేలా వ్యవహరించవద్దని ఈ సందర్భంగా మంచు విష్ణుకి సీపీ ఆదేశించారు. మరోసారి ప్రైవేట్ సెక్యూరిటీ, బౌన్సర్లతో గొడవలకు పాల్పడవద్దని సూచించారు. ఈ సందర్భంగా ఈ నెల 24 వరకు హైకోర్టు ఇచ్చిన మినహాయింపు గురించి సీపీకి విష్ణు తెలిపారు.

ఇంటిదగ్గర ఎలాంటి ఇబ్బంది ఉన్నా పోలీసులకు సమాచారం అందించాలని విష్ణుకు సీపీ సూచించారు. శాంతి భద్రతలుకు విఘాతం కలిగిస్తే లక్షరూపాయలు జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం తదుపరి చర్యలు ఉంటాయని సీపీ సుధీర్​ బాబు తెలిపారు.

మంచు విష్ణును వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని రాచకొండ సీపీ ఆదేశించిన నేపథ్యంలో కమిషనరేట్​ కార్యాలయానికి విష్ణు చేరుకున్నారు. మంచు కుటుంబ వివాదం కేసులో నేరేడ్​మెట్​లోని సీపీ కార్యాలయంలో అదనపు జిల్లా మెజిస్ట్రేట్​ హోదాలో మంచు విష్ణును విచారించారు.

ఉదయం మంచు మనోజ్ విచారణ : సీపీ ఎదుట ఉదయం మంచు మనోజ్​ విచారణ జరిగింది. ఈ సందర్భంగా మంచు మనోజ్​ నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. కుటుంబ వివాదాలను శాంతి భద్రతల సమస్యగా మార్చకూడదని సీపీ చెప్పారు. వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని మనోజ్​కు సీపీ సూచించారు. ఎలాంటి ప్రతికూల చర్యలకు దిగకుండా ఉంటానని మనోజ్​ బాండ్ ఇచ్చారు.

మంచు విష్ణు ప్రధాన అనుచరుడు అరెస్ట్ : మరోవైపు ఈ కేసులో హీరో మంచు మనోజ్‌పై దాడి కేసులో విష్ణు ప్రధాన అనుచరుడు కిరణ్‌ను పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. 3 రోజుల క్రితం తనపై దాడి చేశారని నటుడు మనోజ్‌ పహడీషరీఫ్ పోలీసులకు కంప్లైంట్​ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు బుధవారం ఈ అరెస్ట్‌ చేశారు. జల్‌పల్లిలో తనపై దాడి చేయడమే కాకుండా సీసీటీవీ ఫుటేజ్‌ను మాయం చేశారన్న మనోజ్‌ కంప్లైంట్​ మేరకు మోహన్‌బాబు మేనేజర్‌ కిరణ్‌, విజయ్‌ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా సమాచారం. ఇదే కేసులో నలుగురు మోహన్ బాబు సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉన్నట్లు సమాచారం.

హైకోర్టులో మోహన్‌బాబుకు ఊరట - అప్పటివరకు పోలీసుల ముందు హాజరుకు మినహాయింపు

'అదే మా నాన్న చేసిన తప్పు - నేను లేని నాలుగైదు రోజుల్లోనే గొడవలు జరిగాయి'

Last Updated : Dec 11, 2024, 10:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.