ETV Bharat / technology

గూగుల్ సెర్చ్​లో ఇంట్రెస్టింగ్ టాపిక్స్- ఈ ఏడాది ఎక్కువగా ఏం సెర్చ్ చేశారో తెలుసా? - GOOGLE YEAR IN SEARCH 2024

గూగుల్ 'ఇయర్ ఇన్ సెర్చ్ 2024' రిలీజ్.. టాప్-10 ట్రెండింగ్ టాపిక్స్ ఇవే..!

Google 2024 Search Trends
Google 2024 Search Trends (Google India)
author img

By ETV Bharat Tech Team

Published : Dec 11, 2024, 5:45 PM IST

Google Year in Search 2024: ప్రముఖ సెర్చ్​ ఇంజిన్ గూగుల్ ఈ ఏడాది భారతీయులు అత్యధికంగా సెర్చ్ చేసిన టాపిక్ లిస్ట్​లను రిలీజ్ చేసింది. అందులో IPL నుంచి ఒలింపిక్స్ వరకు స్పోర్ట్స్, 'స్త్రీ 2' మూవీ నుంచి కొరియన్ డ్రామాల వరకు ఎంటర్టైన్మెంట్, ఇండియన్ మ్యూజిక్ హిట్స్​ వంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి.

గూగుల్ సెర్చ్​​లో రాజకీయ రంగంలోకి ప్రవేశించి తొలిసారే సత్తా చాటిన 'వినేష్ ఫోగట్' గురించి తెగ వెతికేశారట. హర్యానా నుంచి బరిలోకి దిగిన ఆమె జులానా స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఆమె గురించి తెలుసుకోవాలన్న ఉత్సుకతతో ఎక్కువమంది గూగుల్‌లో ఫొగాట్ గురించి సెర్చ్ చేశారు.

ఆమె తర్వాత హార్దిక్ పాండ్యా, రతన్ టాటా గురించి ఎక్కువగా సెర్చ్ చేసినట్లు గూగుల్ తన బ్లాగ్​ పోస్ట్​లో తెలిపింది. ఇక 'అజర్‌బైజాన్' అనేది గూగుల్ సెర్చ్​లో ట్రావెల్ ఫేవరెట్ ప్లేస్​గా​ నిలిచింది. వీటితో పాటు ఈ టాప్ సెర్చింగ్ లిస్ట్​లో 'ఆరెంజ్ పీల్ థియరీ', 'థ్రోనింగ్ డేటింగ్' వంటి రిలేషన్​షిప్స్ ఫోకసింగ్ మీమ్స్​తో పాటు వర్క్​ప్లేస్ బిహేవియర్ 'Gen Z బాస్' మీమ్ కూడా ఉంది.

ఈ ఏడాది 'Pookie', 'demure', 'Moye Moye' వంటి చమత్కారమైన లింగో, మీమ్స్​ను ఎక్కుగా ప్రజాదరణ పొందాయి. వీటితో పాటు పాలస్తీనా వివాదంతో ప్రజలు ఎక్కువగా 'All Eyes on Rafah' అని సెర్చ్ చేసినట్లు గూగుల్ తెలిపింది. ఇక లోక్ సభ ఎన్నికలు భారత రాజకీయాల్లో ఆసక్తిని పెంచాయి. ఈ నేపథ్యంలో ఎక్కువమంది 'How to vote Lok Sabha' అనే అంశంపై శోధించారు. ప్రజలు ఆరోగ్యం, వాతారణంపై ఎక్కువగా ఆందోళన చెందుతూ 'excessive heat​', 'AQI near me' వంటి అంశాలపై సెర్చ్ చేసినట్లు గూగుల్ తెలిపింది.

ఓవరాల్ టాప్-10 సెర్చింగ్ లిస్ట్ ఇదే: మన దేశంలో 2024లో అత్యధికంగా 'ఇండియన్ ప్రీమియర్ లీగ్' కోసం సెర్చ్ చేశారు. ఇక 'T20 వరల్డ్ కప్', 'భారతీయ జనతా పార్టీ', 'ఎలక్షన్ రిజల్ట్స్ 2024', 'ఒలింపిక్స్ 2024' టాప్-5 లిస్ట్​లో మిగిలిన వరుసగా మిగిలిన స్థానాలను ఆక్రమించాయి. ఆ తర్వాత స్థానాల్లో 'ఎక్సన్స్సివ్ హీట్​', 'రతన్ టాటా', 'ఇండియన్ నేషనల్ కాంగ్రెస్', 'ప్రో కబడ్డీ లీగ్', 'ఇండియన్ సూపర్ లీగ్' భారత్​లో ఈ సంవత్సరం టాప్-10 ట్రెండింగ్​లో ఉన్నాయి.

India's Year in Search 2024: Overall and more
India's Year in Search 2024: Overall and more (Google India)

మూవీస్ అండ్ షోస్​: ఈ ఏడాది మన దేశంలో.. గూగుల్​లో అత్యధికంగా సెర్చ్ చేసిన మూవీస్​లో 'స్త్రీ 2' అగ్రస్థానంలో ఉంది. అదే సమయంలో 'హను-మాన్', 'కల్కి' సినిమాలు కూడా తమ కథనాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఇక షోస్ విషయానికి వస్తే ఇటీవల ఓటీటీల్లో అదరగొడుతున్న సిరీస్​లో 'హీరామండి' టాప్​ వన్​గా నిలిచింది. తర్వాత క్రైమ్ రివేంజ్ థ్రిల్లర్ డ్రామా సిరీస్ మూడో సీజన్..'మీర్జాపూర్' రెండో స్థానాన్ని ఆక్రమించింది. తర్వాతి స్థానాల్లో 'పంచాయత్', 'కోటా ఫ్యాక్టరీ' వంటి షోలు నిలిచాయి. వీటితోపాటు డిస్నీ ప్లస్​ హాట్​స్టార్​లో అత్యధిక వ్యూయర్స్​ను సొంతం చేసుకున్న 'ది లాస్ట్ ఆఫ్ అస్' అనే ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్ నెక్స్ట్ ప్లేస్​ను కైవసం చేసుకుంది. దీనితోపాటు 'ది లాస్ట్ ఆఫ్ అస్', 'క్వీన్ ఆఫ్ టియర్స్, 'మ్యారీ మై హస్బండ్' వంటి కొరియన్ డ్రామాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

స్పోర్ట్స్ ఈవెంట్స్: 'IPL', 'ప్రో కబడ్డీ లీగ్', 'ఇండియన్ సూపర్ లీగ్' వంటి లోకల్ లీగ్స్​ నుంచి 'ఒలింపిక్స్', 'T20 వరల్డ్ కప్', 'కోపా అమెరికా' వంటి గ్లోబల్ ఈవెంట్‌ల వరకు ఔత్సాహికులు గూగుల్​ను ఆశ్రయించారు. క్రికెట్ మ్యాచ్​లు, ముఖ్యంగా 'ఇంగ్లండ్', 'బంగ్లాదేశ్'​తో.. 'ఇండియా' తలపడిన మ్యాచ్​లు ఎక్కువ వ్యూయర్​షిప్ పొందాయి. 'వినేష్ ఫోగట్', 'హార్దిక్ పాండ్యా', 'శశాంక్ సింగ్', 'అభిషేక్ శర్మ', 'లక్ష్య సేన్' వంటి అథ్లెట్లు ట్రెండింగ్ పర్సనాలిటీగా మారడంతో.. టాప్ ట్రెండింగ్ పీపుల్ సెర్చ్‌లలో సగభాగం స్పోర్ట్​ విభాగమే ఆధిపత్యం చెలాయించింది.

టాప్ సాంగ్స్ సెర్చ్: ఈ ఏడాది 'గూగుల్ సాంగ్ ఫైండర్'.. ఎక్కువగా 'ఏ తునే క్యా కియా', 'యే రాతే యే మౌసమ్' వంటి నాస్టాలిక్ ట్యూన్​లతో పాటు 'నాదానియన్', 'హుస్న్' వంటి ఇండియన్ సాంగ్స్​పై అత్యధిక ప్రశ్నలను అందుకుంది.

India's Year in Search 2024 for movies and more
India's Year in Search 2024 for movies and more (Google India)

ట్రావెల్ డెస్టినేషన్స్ అండ్ రెసిపీస్: ఈ సంవత్సరం 'బాలి', 'అజర్‌బైజాన్' నుంచి 'మనాలి', 'జైపూర్' వరకు ట్రావెలింగ్​పై ఎక్కువమంది ఆసక్తి చూపించారు. ఇక రెసిపీల్లో 'మామిడికాయ పచ్చడి', 'ఉగాది పచ్చడి' వంటి దేశీయ సంప్రదాయ వంటకాలపై సెర్చ్ చేశారు. అలాగే ఈ వంటకాల సెర్చింగ్ లిస్ట్​లో.. 'పోర్న్‌స్టార్ మార్టిని', 'ఫ్లాట్ వైట్' వంటి గ్లోబల్ ఫేవరెట్‌ ఐటెమ్స్​తో పాటు 'చమ్మంత', 'ఓనం సధ్య' వంటి ప్రాంతీయ స్పెషల్ వంటకాలు ఉన్నాయి.

మీమ్స్ అండ్ మోర్: ఈ ఏడాది ప్రజలు ఎక్కువగా 'బ్లూ గ్రించ్ నీ సర్జరీ', 'హాంస్టర్ మెమె', 'వెరీ డిమ్యూర్, వెరీ మైండ్‌ఫుల్', 'జెన్ Z బాస్' వంటి వర్క్ ప్లేస్ బిహేవియర్స్​ను హైలెట్ చేసే మీమ్స్​ను ఎక్కువగా సెర్చ్ చేశారు. 'ఆరెంజ్ పీల్ థియరీ' వంటి రిలేషన్​షిప్క్స్ ఫోకసింగ్ మీమ్ కూడా అత్యధికంగా సెర్చ్ చేశారు. వీటితో పాటు 'థ్రోనింగ్ డేటింగ్' అనే మోస్ట్ పాపులర్ డేటింగ్ రిలేటెడ్ సెర్చ్​ కూడా ఈ టాప్ ట్రెండిగ్ లిస్ట్​లో ఉంది.

మరణాన్ని ఆపగలికే క్లాక్..!- దీనితో 'డెత్ డేట్' తెలుసుకో.. తలరాతను మార్చుకో..!

మొన్న మహింద్రా, నిన్న టాటా.. న్యూ ఇయర్ సమీపిస్తున్న కొద్దీ కార్ల ధరలకు రెక్కలు!

వారెవ్వా.. గూగుల్ 'విల్లో' వెరీ పవర్​ఫుల్ బాస్- దీని స్పీడ్​కి ఎవరైనా సలాం కొట్టాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.