ETV Bharat / state

బ్యాంక్ మోసగాన్ని పట్టించిన జీ-మెయిల్ - మూడేళ్లుగా తప్పించుకుని చిన్న ఆధారంతో! - BANK FRAUD ARRESTED IN HYDERABAD

కోర్టు శిక్ష విధిస్తుందని పారిపోయిన నిందితుడు - మూడేళ్ల తర్వాత జీ- మెయిల్ ద్వారా పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు.

Bank Fraud Case Accused Arrest
Bank Fraud Case Accused Arrest In Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 9, 2024, 9:41 AM IST

Bank Fraud Case Accused Arrest In Hyderabad : గర్తింపు కార్డులతో బ్యాంకుల నుంచి రుణం తీసుకొని మోసగించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేసి జ్యుడిషియల్‌ రిమాండ్‌కు పంపారు. అనంతరం న్యాయస్థానంలో కేసు విచారణకు వచ్చింది. జైలుశిక్ష తప్పదని అనుకున్న అతడు పోలీసుల నుంచి పారిపోయాడు. చిరునామా మార్చి పోలీసులను ఏమార్చాడు. ఎవరికీ దొరకనన్న ధైర్యంతో ఉన్న అతడిని జీ- మెయిల్ పోలీసులకు పట్టించింది.

పోలీసుల వివరాల ప్రకారం : యూసుఫ్‌గూడలో నివసిస్తున్న కె.ఎన్‌.రంజిత్‌రెడ్డి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసేవాడు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించేందుకు అడ్డదారులను ఎంచుకున్నాడు. 2016లో నకిలీ ఓటరు గుర్తింపు, పాన్‌కార్డులను సృష్టించి సికింద్రాబాద్‌ రాణిగంజ్‌లోని బ్యాంకు నుంచి రూ.50లక్షల రుణం తీసుకున్నాడు. అక్కడ తేలికగా రుణం రావడంతో వివిధ రకాల పేర్లు, నకిలీ గుర్తింపు కార్డులతో మరికొన్ని బ్యాంకుల నుంచి భారీ ఎత్తున రుణాలు పొందాడు.

మాయగాడిపై పక్కా సమాచారం అందుకున్న పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు 2016 జులై 30న అదుపులోకి తీసుకొని విచారించగా ఇతడి మోసాలు బయటపడ్డాయి. దీనిపై మహంకాళి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 2021లో కోర్టులో కేసు విచారణ జరుగుతుండగా శిక్ష తప్పదని భావించిన రంజిత్‌రెడ్డి కోర్టు ఆవరణలోని బాత్రూంకు వెళ్లి అటు నుంచి పారిపోయాడు. అప్పటి నుంచి ఇతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సిమ్‌లు కార్డులు, చిరునామా మార్చి : పోలీసులకు దొరకకుండా ఉండడానికి రూపం మాత్రమే కాదు తన చిరునామా కూడా మార్చుకున్నాడు. ఒకేచోట ఎక్కువకాలం ఉండకుండా తరచూ ప్రాంతాలు మార్చుకుంటూ వచ్చాడు. తనతో పాటు కుటుంబ సభ్యులు ఉపయోగించే ఫోన్లు, సిమ్‌కార్డులను పూర్తిగా మార్చేశాడు. ఏ ఒక్కరికీ అందుబాటులో ఉండకుండా పోలీసుల నుంచి తప్పించుకున్నాననే ధైర్యంగా ఉన్నాడు.

ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ సుదీంద్ర, ఉత్తర మండలం ఇన్‌స్పెక్టర్‌ సైదులు బృందం సాంకేతిక ఆధారాలను విశ్లేషించి నిందితుడు ఉపయోగించిన మొబైల్ నెంబర్ల ఆధారంగా ప్రయత్నించారు. తాను వాడుతున్న జీ-మెయిల్‌ను ట్రాక్‌ చేయగా ఒక ఫోన్‌ నంబర్‌తో తరచూ మాట్లాడుతున్నట్టు గుర్తించారు. దాని ఆధారంగా కూపీ లాగితే నిందితుడి ఆచూకీ లభించింది. శనివారం రంజిత్‌రెడ్డిని అదుపులోకి తీసుకొని మహంకాళి పోలీసులకు అప్పగించారు.

'ఐసీఐసీఐ' నరేశ్​ సెల్ఫీ వీడియో కలకలం - అందరి చిట్టా విప్పాడు

బ్యాంకును మోసగించి - 20 ఏళ్లుగా గెటప్​లు మార్చి - చిన్న క్లూతో ఎట్టకేలకు దొరికాడు - Bank Fraud Case Accused Arrest

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.