ETV Bharat / sports

ఆసక్తిగా మారిన WTC పాయింట్ల పట్టిక - టాప్‌ 1కు భారత్ చేరాలంటే సమీకరణాలు ఇలా!

ప్రస్తుత పరిస్థితుల్లో టీమ్‌ఇండియా టాప్‌ 1 స్థానంతో ఈ సైకిల్‌ను ముగించాలంటే సమీకరణాలు ఎలా ఉన్నాయంటే?

World Test Championship Points Table
World Test Championship Points Table (source Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : 2 hours ago

World Test Championship Points Table : మ్యాచ్‌లు జరుగుతోన్న కొద్ది డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక ఆసక్తికరంగా మారుతోంది. మొదటి రెండు స్థానాల కోసం ఆయా జట్ల మధ్య హోరాహోరీ పోరు గట్టిగా కొనసాగుతోంది. బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీని ఘనంగా ప్రారంభించిన భారత జట్టు టాప్‌ 1లోకి వెళ్లింది. అయితే పింక్‌ బాల్‌ టెస్టులో మాత్రం ఘోర పరాజయాన్ని అందుకోవడంతో మూడో స్థానానికి పడిపోవాల్సి వచ్చింది. ఇంకా మరో మూడు మ్యాచులు ఆడాల్సి ఉన్న నేపథ్యంలో టీమ్ ఇండియా అగ్రస్థానంలోకి చేరడానికి కొన్ని అవకాశాలు ఉన్నాయి. దానికి సమీకరణాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆస్ట్రేలియాతో (India vs Australia) జరగబోయే మిగతా మూడు మ్యాచ్‌ల్లోనూ టీమ్ ఇండియా గెలుపొందాలి. అప్పుడు 64.04 శాతంతో టీమ్ ఇండియా ముందుకెళ్తుంది. ఆస్ట్రేలియా 55.26 శాతం కన్నా ఎక్కువ సాధించలేదు.

దీంతో అగ్రస్థానం కోసం భారత జట్టుకు పోటీ సౌతాఫ్రికా మాత్రమే. ప్రస్తుతం ఆ జట్టు 63.33 శాతంతో నెం.1 స్ధానంలో కొనసాగుతోంది.

సౌతాఫ్రికా తన తదుపరి రెండు మ్యాచ్‌లను పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ సిరీస్‌ను 1-1తో ముగిస్తే, ఆ జట్టు ఖాతాలో 61.11 శాతం పాయింట్లు ఉంటాయి.

ఒక వేళ సౌతాఫ్రికా 2-0 తేడాతో పాకిస్థాన్‌ను ఓడిస్తే, భారత జట్టు అగ్రస్థానం దక్కదు. 69.44 శాతంతో దక్షిణాఫ్రికా అగ్రస్థానంలోకి వెళ్తుంది.

దక్షిణాఫ్రికా 1-0 తేడాతో సిరీస్‌ను ముగించినా కూడా వారి ఖాతాలో 63.89 పర్సంటేజీ మాత్రమే వస్తుంది. ఇదే సమయంలో ఆస్ట్రేలియాపై మూడు టెస్టుల్లో గెలిస్తే టీమ్‌ ఇండియాకు 64.04 శాతం దక్కుతుంది. దీంతో భారత జట్టే అగ్రస్థానంలోకి వస్తుంది.

ఒకవేళ సౌతాఫ్రికా రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోతే మాత్రం(52.78%), ఆసీస్ జట్టు టాప్‌ 2లోకి వెళ్తుంది. అప్పుడు మళ్లీ టీమ్ ఇండియా, ఆస్ట్రేలియా మధ్యే తుది పోరు చూసే అవకాశం ఉంటుంది.

మొత్తంగా ఆస్ట్రేలియాతో జరిగే మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తేనే టీమ్‌ఇండియాకు అవకాశాలు ఉంటాయి. లేకపోతే తుది పోరు చేరడానికి ఇతర జట్ల రిజల్ట్స్​పై ఆధారపడాల్సి ఉంటుంది.

ఆ భయం మమ్మల్ని వెంటాడుతోంది - ఇక ఛాంపియన్స్ ట్రోఫీ జరగడం కష్టమే : పాక్ మాజీ కెప్టెన్

టీమ్ఇండియా ఫోకస్ అంతా దానిపైనే! మరి రోహిత్​ పొజిషన్ ఎక్కడంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.