ETV Bharat / business

కార్​ అప్​గ్రేడ్ చేయాలా?​ ఈ 8 ఫైనాన్సియల్​ మిస్టేక్స్​ అస్సలు చేయొద్దు!

కొత్త కార్​కు అప్​గ్రేడ్‌ అవ్వాలని అనుకుంటున్నారా? ఈ టిప్స్​ మీ కోసమే!

Car Upgrade Financial Tips
Car Upgrade Financial Tips (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 3 hours ago

Car Upgrade Financial Tips : మీ పాత కారు స్థానంలో కొత్త కారు తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. కొత్త కారుకు అప్​గ్రేడ్ అయ్యేటప్పుడు చాలా మంది తెలిసీ, తెలియక చాలా తప్పులు చేస్తుంటారు. దీని వల్ల ఆర్థికంగా నష్టపోతుంటారు. అందుకే కార్ అప్​గ్రేడ్​ చేసేటప్పుడు చేయకూడదని 8 ఆర్థికపరమైన తప్పులు ఏమిటో ఈ ఆర్టికల్​ ద్వారా తెలుసుకుందాం.

  1. కారు రుణాలు
    చాలా మంది కారు లోన్​ తీసుకుంటూ ఉంటారు. అయితే వివిధ బ్యాంకులు అందించే కారు రుణాల వడ్డీ రేట్లు భిన్నంగా ఉంటాయి. కాబట్టి, రుణం తీసుకునే ముందు వివిధ బ్యాంకులు వసూలుచేసే వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్‌ ఫీజు, ఇతర రుసుములు, రుణ నిబంధనల గురించి తెలుసుకోవాలి. వీటిలో తక్కువ వడ్డీ రేటుతో లోన్ ఇచ్చే బ్యాంకును ఎంచుకోవాలి. లేకుంటే మీపై అనవసర ఆర్థిక భారం పడుతుంది.
  2. క్రెడిట్‌ స్కోర్​
    క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్న‌వారికి బ్యాంకు రుణం ఇవ్వకపోవచ్చు. లేదా రుణంపై అధికంగా వడ్డీని వసూలు చేయొచ్చు. అందుకే లోన్ కోసం దరఖాస్తు చేసే ముందు మీ క్రెడిట్ స్కోర్​ను తనిఖీ చేయాలి. క్రెడిట్ స్కోరు తక్కువగా ఉంటే దాన్ని మెరుగుపర్చడానికి చర్యలు తీసుకోవాలి. మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నవాళ్లకు రుణ సంస్థలు చాలా సులువుగా తక్కువ వడ్డీ రేటుతో రుణాలు మంజూరు చేస్తుంటాయనే విషయాన్ని మీరు గుర్తించాలి.
  3. బడ్జెట్
    చాలా మందికి అదనపు ఫీచర్లతో కూడిన ఖరీదైన కార్​ మోడల్​ను ఎంచుకోవాలనే ఆసక్తి ఉంటుంది. కానీ ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఆర్థిక పరిస్థితికి అనుగుణంగానే తగిన నిర్ణయం తీసుకోవాలి. ముందుగానే మీ బడ్జెట్​ను సెట్‌ చేసుకోవాలి. దానికి దానికి కట్టుబడి ఉండాలి. కారును కొనేటప్పుడు కొత్త ఫీచర్లు, సాంకేతికతనే కాకుండా కారు ఖరీదు, నిర్వహణ ఖర్చులు గురించి కూడా ఆలోచించాలి. అంతేకాకుండా నెలవారీ రుణ చెల్లింపులు చేసేటప్పుడు ఆర్థిక ఒత్తిడి, ఇబ్బందులకు దారితీయకుండా చూసుకోవాలి.
  4. డౌన్​పేమెంట్
    క్రెడిట్‌ స్కోరు మెరుగ్గా ఉన్నవారు కారు రుణాన్ని పొందడం సులభమే అయినప్పటికీ, రుణం తీసుకునేటప్పుడు దరఖాస్తుదారుడు చెల్లించే డౌన్​పేమెంట్‌ కూడా చాలా కీలకం. డౌన్​పేమెంట్​ను బట్టి ప్రయోజనాలు ఉంటాయి. డౌన్​పేమెంట్ ఆధారంగా ఈఎంఐ, లోన్ మొత్తంపై చెల్లించే వడ్డీ తగ్గుతుంది. అధిక డౌన్​పేమెంట్‌ రుణ మొత్తాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. ఫలితంగా నెలవారీ చెల్లింపులు తగ్గుతాయి. దీనివల్ల రుణ వ్యవధిలో చెల్లించే వడ్డీ తక్కువగా ఉంటుంది.
  5. ఈఎంఐ
    చాలా మంది కారు కొనుగోలుదారులు రుణాన్ని ఎంచుకునేటప్పుడు ఈఎంఐ మొత్తంపై మాత్రమే దృష్టి పెడతారు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, తక్కువ ఈఎంఐ ఆకర్షణీయంగా అనిపించినప్పటికీ, ఎక్కువ రుణవ్యవధి ఉండడం వల్ల మీరు కట్టే డబ్బు చాలా ఎక్కువ అవుతుంది.
  6. ఈ ఖర్చులు ఉంటాయి!
    కొత్త కారును కొనేస్తే అయిపోయినట్లు కాదు. బీమా ప్రీమియం, రిజిస్ట్రేషన్‌ ఫీజులు, పన్నులు, ఇంధన ఖర్చులు వంటి అదనపు ఖర్చులను కూడా ముందుగానే బడ్జెట్ కేటాయించుకోవాలి.
  7. రీసేల్
    కొత్త కారును కొనుగోలు చేసేటప్పడు చాలా ఉత్సాహంగా ఉంటుంది. కొన్ని రోజులకు దానిపై ఆసక్తి తగ్గొచ్చు. అలాంటప్పుడు చాలా మంది ఆ కారును అమ్మడానికి మొగ్గుచూపిస్తారు. అయితే, కారు లాంటి భౌతిక వస్తువులకు తరుగుదల ఎక్కువే ఉంటుంది. రీసేల్‌ పై సరైన ధర లభించే అవకాశం తక్కువే. కనుక కొత్త కారు కొనేటప్పుడే మంచి రీసేల్‌ విలువ కలిగిన మోడల్​ను ఎంచుకోవడం మంచిది.
  8. లోన్ ప్రీ అప్రూవల్
    కారు కొనుగోలు కోసం డీలర్లను సంప్రదించేముందు లోన్ అప్రూవల్ అయ్యిందో, లేదో చూసుకోండి. అప్పుడు మీ బడ్జెట్ ఎంతో స్పష్టంగా తెలిసిపోతుంది. కనుక సదరు కారు మీ బడ్జెట్లో ఉందో, లేదో తెలుస్తుంది. మీ కలల కారును సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది.

అలర్ట్- పెరగనున్న కార్ల ధరలు- లిస్ట్​లో ఏఏ కంపెనీలు ఉన్నాయంటే?

ఫస్ట్ టైమ్ కొత్త కారు కొన్నారా? డెలివరీకి ముందు కచ్చితంగా ఈ 5 అంశాలను చెక్‌ చేయాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.