తెలంగాణ

telangana

ETV Bharat / sports

'CSK లిమిట్ క్రాస్ చేయకూడదు- ఫ్రాంచైజీ కంటే దేశమే ముఖ్యం!'

CSK ఫ్రాంచైజీని తప్పుబట్టిన ఊతప్పు- హద్దులు దాటకూడదని సూచన!

Robin Uthappa On CSK
Robin Uthappa On CSK (Source: Associated Press)

By ETV Bharat Sports Team

Published : Nov 7, 2024, 1:34 PM IST

Robin Uthappa On CSK :టీమ్ఇండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప చెన్నై సూపర్ కింగ్స్ ​ ఫ్రాంఛైజీ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాడు. న్యూజిలాండ్ ప్లేయర్​ రచిన్ రవీంద్రను చెన్నైలోని తమ అకాడమీలో ప్రాక్టీస్​కు అనుమతించినందుకు ఊతప్ప సీఎస్​కేపై విమర్శలు గుప్పించాడు. ఫ్రాంచైజీ క్రికెట్ ​కంటే దేశమే ముందుంటుందని గ్రహించాలని అన్నాడు. ఇటీవల చెన్నై వేదికగా భారత్​- న్యూజిలాండ్ టెస్టు మ్యాచ్ నేపథ్యంలో ఊతప్ప తన యూట్యూబ్​ ఛానెల్​లో ఈ వ్యాఖ్యలు చేశాడు.

'భారత్​తో తొలి టెస్టు సందర్భంగా కివీస్ ప్లేయర్​ రచిన్ రవీంద్ర చెన్నై అకాడమీలో ప్రాక్టీస్ చేశాడు. సీఎస్కే అద్భుతమైన ఫ్రాంచైజీ. వాళ్లు తమ ప్లేయర్లను ఎప్పుడూ బాగానే చూసుకుంటారు. నాకు సీఎస్కే అంటే ఇష్టమే. కానీ, ఫ్రాంచైజీ ప్లేయర్​కంటే మన దేశానికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. మరీ ముఖ్యంగా ఓ ఫారిన్ ప్లేయర్ మన దేశానికి వచ్చి, మన జట్టుపైనే ఆడినప్పుడు కొన్ని హద్దులు పెట్టుకోవాల్సి ఉంటుంది. వాటిని దాటకూడదు. బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల రచిన్ రవీంద్ర ఆ మ్యాచ్​లో అద్భుతంగా ఆడాడు. 157 బంతుల్లో 134 పరుగులు చేశాడు. భారత్ పిచ్​లపై ఓవర్సీస్ ప్లేయర్లు ఆడిన అత్యుత్తమ ఇన్నింగ్స్​ల్లో ఇది ఒకటి. ఈ ఇన్నింగ్స్​తో న్యూజిలాండ్​ జట్టుకు భవిష్యత్​లో​ తానే భరోసా అని నిరూపించాడు.

కాగా, చెన్నై వేదికగా జరిగిన ఆ మ్యాచ్​లో కివీస్ 8 వికెట్ల తేడాతో నెగ్గింది. తొలి ఇన్నింగ్స్​లో 134 పరుగులు బాదిన రచిన్, రెండో ఇన్నింగ్స్​లో 39 పరుగులు నాటౌట్​గా నిలిచి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అయితే ఈ ప్రాక్టీస్ తన ప్రదర్శనకు ఎంతగానో ఉపయోగపడిందని రచిన్ రవీంద్ర మ్యాచ్ అనంతరం చెప్పాడు.

ఇక ఐపీఎల్​లో రచిన్ చెన్నై తరఫున ప్రాతినిధ్యం వహించాడు. కానీ, ఇటీవల రిటెన్షన్స్​లో సీఎస్కే అతడిని రిలీజ్ చేసింది. దీంతో రచిన్ మెగా వేలంలోకి వచ్చాడు. ఈ వేలంలో అతడి బెేస్​ప్రైజ్​ రూ. 1.50 కోట్లుగా ఉంది.

ప్లేయర్‌ని తిట్టాలనుకుంటే ధోని ఏం చేస్తాడో తెలుసా? ఆన్సర్ వింటే ఆశ్చర్యపోతారు!

'అది చాలా కష్టమైంది!' : IPL 2025 ఆడటంపై క్లారిటీ ఇచ్చిన ధోనీ!

ABOUT THE AUTHOR

...view details