Riyan Parag IPL 2024: 2024 ఐపీఎల్లో జైపుర్ వేదికగా జరిగిన రాజస్థాన్- దిల్లీ మ్యాచ్‌లో యంగ్ బ్యాటర్ రియాన్ పరాగ్ అదరగొట్టాడు. అద్భుత ఇన్నింగ్స్ (84* పరుగులు) తో రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అయితే కొంతకాలంగా ఫామ్‌లేమితో తంటాలు పడ్డ రియాన్ ఈ సీజన్లో టచ్‌లోకి వచ్చినట్లు కనిపిస్తున్నాడు. ఇక మ్యాచ్ అనంతరం రియాన్ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.
'ఎమోషన్స్‌ను కంట్రోల్ చేసుకోవడం అలవాటైంది. కొంతకాలంగా మా అమ్మ నాతో పాటే ఉంటున్నారు. నా కష్టాలు అన్నీ స్వయంగా ఆమె చూశారు. అయితే నా సామర్థ్యం ఏంటో నాకు తెలుసు. నా ప్రదర్శన బాగున్నా, బాగోలేకపోయినా నేను ఇలాగే ఉంటా. నా ఆత్మ విశ్వాసం ఎప్పటికీ తగ్గదు. డొమెస్టిక్ క్రికెట్ లీగ్‌ల్లో ఆడడం కలిసొచ్చింది. ఐపీఎల్లో కాస్త ఒత్తిడి ఉంటుంది. టాప్- 4 బ్యాటర్లలో ఎవరైనా ఒకరు ఇన్నింగ్స్ మొత్తం క్రీజులో ఉంటే జట్టుకు భారీ స్కోర్ అందే అవకాశం ఉంటుంది. లఖ్‌నవూ మ్యాచ్‌లోనూ అదే జరిగింది. కానీ, నాకు ఈ మ్యాచ్‌లో సమయం వచ్చింది. ఈ ఇన్నింగ్స్ మంచి అనుభూతి ఇస్తోంది' అని రియాన్ అన్నాడు.